How to Make Homemade French Fries:బంగాళదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటికి కాస్త ఉప్పు-కారం, మసాలా దట్టించి తింటే.. ఆ టేస్టే వేరే లెవల్ ఉంటుంది. అయితే, చాలా మంది వీటిని ఇంట్లో చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని.. బయటే కొనుగోలు చేస్తారు. కానీ.. ఈ పద్ధతి పాటిస్తే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 3 బంగాళ దుంపలు (పెద్దవి)
- అర చెక్క నిమ్మ రసం
- రుచికి సరిపడా ఉప్పు
- 3 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్
- ఫ్రైకి సరిపడా నూనె
- అర టీ స్పూన్ కారం
- అర టీ స్పూన్ చాట్ మసాలా
- అర టీ స్పూన్ ఆమ్ చూర్ పొడి
- అర టీ స్పూన్ చక్కెర పొడి
తయారీ విధానం
- ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి చెక్కు తీయాలి. ఆ తర్వాత బంగాళ దుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మరీ సన్నగా, లావుగా కాకుండా మీడియం సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు వీటిని ఓ గిన్నెలో వేసి మూడు సార్లు బాగా కడగాలి.
- మరో వైపు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
- నీళ్లు మరుగుతున్న సమయంలో కొద్దిగా ఉప్పు, నిమ్మ రసం పిండి నిమ్మతొక్కను దానిలోనే వేసుకోవాలి.
- ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసిన ఆలూ ముక్కలను వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. (మధ్యమధ్యలో కింది నుంచి పైకి కలుపుతూ ఉండాలి. కింది బాగా ఉడికి పైనా బాగా ఉడకవు)
- అనంతరం జల్లి గంటతో ఆలూ ముక్కలను నీటిలో నుంచి తీసి పక్కకు పెట్టుకుని 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. (ఆలూ ముక్కలు పూర్తిగా చల్లారాలి. త్వరగా చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు)
- ఆలూ ముక్కలు చల్లారిన తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి నిధానంగా కలపాలి.
- ఇప్పుడు ఫ్రై చేసేందుకు స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె బాగా వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలను వేసి నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత వీటిని తీసి బయట పెట్టుకుని.. మరి కొన్ని ఆలూ ముక్కలను వేసుకోవాలి.
- మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అంతకుముందు వేయించిన ఆలూ ముక్కలను మరోసారి వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మసాలా కోసం ఓ చిన్న గిన్నెలో కారం, రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా, ఆమ్ చూర్ పొడి, చక్కెర పొడిని వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఆలూ ముక్కలపై చల్లుకుంటే టేస్టీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!
ఎన్నిసార్లు చేసినా "ఇడ్లీలు" మెత్తగా రావట్లేదా ? - ఈ కొలతలు, టిప్స్ పాటిస్తూ చేస్తే దూదిలాంటివి పక్కా!
కూరగాయలు లేనప్పుడు - 5 నిమిషాల్లోనే ఇలా "ఉల్లిగడ్డ కారం" చేసుకోండి! - వేడివేడి అన్నంలో తింటే అమృతమే!