తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మటన్​ ఎప్పుడూ కావొద్దు రొటీన్! - ఈ సారి దోసకాయ మటన్ కర్రీ చేయండి - సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు - Dosakaya Mutton Curry Recipe - DOSAKAYA MUTTON CURRY RECIPE

Dosakaya Mutton Curry Recipe: ఆదివారం వచ్చిందంటే ఇంట్లో తప్పకుండా నాన్​వెజ్ ఉండాల్సిందే. అందులోనూ మటన్ కర్రీ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే.. రొటీన్​గా చేసుకునే రెసిపీలో పెద్దగా ఫీల్ ఉండదు. అందుకే.. ఈ సారి దోసకాయ మటన్ కర్రీ ప్లాన్ చేయండి. సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు. మరి.. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Dosakaya Mutton Curry Recipe
Dosakaya Mutton Curry Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 23, 2024, 2:19 PM IST

Dosakaya Mutton Curry Recipe: వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. చికెన్​తో పోలిస్తే కాస్త రేటు ఎక్కువైనా పర్లేదు కానీ సండే రోజు మటన్ తినాల్సిందేనంటారు చాలా మంది నాన్​వెజ్ లవర్స్​. అయితే రొటీన్​గా మటన్ కర్రీ వండుకోవడంలో మజా ఏముంటుంది? అందుకే ఎప్పుడు ఒకేలా తినడానికి బదులు కొత్త కొత్త రెసిపీలను ట్రై చేయాలి. అప్పుడే నాన్​ వెజ్​ మజా ఏంటో తెలుస్తుంది.

అలాంటి ఓ రెసిపీని మీకోసం తీసుకొచ్చాం. అదే దోసకాయ మటను. మటన్​కు దోసకాయను యాడ్ చేసి ట్రై చేస్తే.. టేస్ట్ అద్దిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ కూరను వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. మరి ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 2 దోసకాయలు
  • 8 పచ్చిమిరపకాయలు
  • 4 ఉల్లిపాయలు
  • ఒక కేజీ మటన్
  • అర చెంచా పసుపు
  • రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్
  • రెండున్నర చెంచాల కారం
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఒక చెంచా గరం మసాలా
  • నూనె

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో మటన్​ను తీసుకుని శుభ్రంగా కడగి పక్కకు పెట్టుకోవాలి.
  • అలాగే దోసకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను క్లీన్ చేసుకుని ముక్కలుగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్ చేసుకుని కర్రీ వండే గిన్నె పెట్టి, అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • అనంతరం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి 3 నిమిషాల పాటు వేపుకోవాలి.
  • ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేవరకు వేయించుకున్నాక పసుపు వేసి కలపాలి.
  • ఆ తర్వాత శుభ్రంగా కడిగిన మటన్​ను వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. (మటన్ తీసుకునేటప్పుడు ఫ్యాట్ ఉండేలా చూసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది)
  • ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసి కలపాలి.
  • ఆ తర్వాత కారం, ఉప్పు వేసి 2 గ్లాసుల నీటిని పోసి బాగా కలపాలి.
  • అనంతరం మూత పెట్టుకుని మటన్​ బాగా ఉడికేవరకు మగ్గనివ్వాలి(ఇది మటన్ రకాన్ని బట్టి ఉడికే సమయం మారుతుంది)
  • మటన్ ఉడికాక గరం మసాలా వేసుకుని కలిపి 2 నిమిషాల పాటు ఉంచి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది

సేమియా ఉప్మా ముద్ద ముద్దగా అవుతోందా? - ఇలా చేస్తే పొడిపొడిగా చాలా రుచికరంగా ఉంటుంది! - How to Make Semiya Upma

మైసూర్ బోండాకు హోటల్ రుచి రావట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే అమోఘమైన టేస్ట్! - How to Prepare Mysore Bonda

ABOUT THE AUTHOR

...view details