తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బీరకాయతో రొటీన్ పచ్చడి, కర్రీలు ఎందుకు? - వెరైటీగా పాలు పోసి ట్రై చేయండి - సూపర్​ అనాల్సిందే! - Beerakaya Milk Curry - BEERAKAYA MILK CURRY

Beerakaya Kura: మీకు బీరకాయ అంటే చాలా ఇష్టమా? కానీ.. దీంతో చేసే రొటీన్ కర్రీలు, పచ్చళ్లు తిని బోర్ కొడుతుందా? అయితే ఓసారి బీరకాయలో పాలు పోసి వండండి. ఏంటి బీరకాయలో పాలు పోసి వండుతారా? అని అనుకుంటున్నారా? అయితే, మీరూ ఓ సారి ట్రై చేయండి దీని టేస్ట్ అద్దిరిపోతుంది.

Beerakaya Palu Posina Kura
Beerakaya Palu Posina Kura (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 26, 2024, 10:42 AM IST

Beerakaya Milk Curry:బీరకాయను చాలా రకాలుగా వండుకుంటుంటారు. కొందరు శనగపప్పుతో కలిపి కర్రీ చేసుకోగా మరి కొందరు పచ్చళ్లు చేసుకుంటారు. ఇంకొందరు బీరకాయ పప్పు చేసుకుంటుంటారు. అయితే ఇలా ప్రతీసారి రొటీన్​గా కాకుండా వెరైటీగా తినాలంటే.. బీరకాయలో పాలు పోసి వండండి. టేస్ట్ అద్దిరిపోతుంది. దీనిని ప్రిపేర్​ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు
  • ఒక చెంచా జీడిపప్పు
  • ఒక టీ స్పూన్ గసగసాలు
  • అర ఇంచు దాల్చిన చెక్క (ఆప్షనల్)
  • 3 పచ్చిమిరపకాయలు
  • అర కప్పు కొబ్బరి పాలు
  • 2 టేబుల్ స్పూన్ల నూనె
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • రెండు రెబ్బల కరివేపాకు
  • 350 గ్రాముల బీరకాయ ముక్కలు
  • ముప్పావు కప్పు పాలు (కొబ్బరి లేదా సాధారణ పాలు)
  • రుచికి సరిపడా ఉప్పు
  • కొద్దిగా కొత్తిమీర తరుగు

తయారీ విధానం

  • ముందుగా కూర వండే 30 నిమిషాల ముందు ఓ గిన్నెలో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు, దాల్చిన చెక్క, పచ్చి మిర్చి, కొబ్బరి పాలు పోసి నానబెట్టాలి.
  • ఆ తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని మిక్సీ జార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇందులోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి కాసేపు చిటపటమనించాలి.
  • ఆ తర్వాత చెక్కు తీసిన లేత బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సుమారు 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
  • ఇప్పుడు మూత తీసి కలిపి పాలు పోసి మెత్తగా మగ్గనివ్వాలి.
  • ఆ తర్వాత కాసేపటికి ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి కలిపి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. (కారం తక్కువగా ఉంది అనిపిస్తే ఎండు కారం వేసుకోవచ్చు)
  • అనంతరం రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి దించేసుకుంటే టేస్టీ పాలు పోసిన బీరకాయ కర్రీ రెడీ!
  • దీనిని వేడి వేడి అన్నంలో లేదా చపాతీలకు అద్భుతంగా ఉంటుంది.

రొటీన్ పులావ్​లు తిని బోర్​ కొట్టిందా? - వెరైటీగా నవరతన్ పులావ్ చేసుకోండి - రెస్టారెంట్​ టేస్ట్​ పక్కా! - Navratan Pulao Recipe in Telugu

నోరూరించే "ఆంధ్ర స్టైల్ చేపల పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్​ కేక అంతే! - Chepala Pulusu Recipe

ABOUT THE AUTHOR

...view details