తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఉసిరికాయతో జ్యూసీ స్వీట్ చేసుకోండి- ఏడాది పాటు హాయిగా తినండి!

-రెగ్యులర్​ స్వీట్స్​ను మించిన టేస్ట్​- కేవలం నిమిషాల్లోనే రెడీ -ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉసిరికాయలు తినొచ్చు

Amla Murabba Recipe Instant
Amla Murabba Recipe Instant (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Amla Murabba Recipe Instant: ఉసిరి కాయలు అనగానే చాలా మందికి వెంటనే పచ్చడి గుర్తుకు వస్తుంటుంది. కానీ దీంతో జ్యూసీ స్వీట్ చేసుకుంటారని మీలో ఎంత మందికి తెలుసు? ఇంకా దీనిని చాలా టేస్టీగా ఇన్​స్టంట్​గా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుని పెట్టుకుంటే సుమారు ఏడాది పాటు హాయిగా తినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • అర కిలో ఉసిరి కాయలు
  • అర కిలో చక్కెర
  • పావు టీ స్పూన్ ఉప్పు
  • ఒక టీ స్పూన్ నిమ్మ రసం
  • 4 యాలకులు

తయారీ విధానం

  • ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడుచుకోవాలి.
  • అనంతరం స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి.
  • నీరు మరుగుతున్న సమయంలో దానిపైన జల్లి గిన్నెను పెట్టుకుని వాటిలో ఉసిరికాయలు వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. (ఇలా స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలను కూడా వాడుకోవచ్చు. వీటిని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా చేస్తే మురబ్బా చెడిపోయే అవకాశం ఉంటుంది)
  • ఉసిరికాయలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొద్ది సేపు చల్లారబెట్టుకోవాలి.
  • పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరి కాయలకు ఫోర్క్ స్పూన్​తో చిల్లులు పెట్టుకుని పక్కకు పెట్టాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో చక్కెర, 3 టేబుల్ స్పూన్ల నీరు, ఉసిరికాయలను వేసి లో ఫ్లేమ్​లో మరిగించుకోవాలి. (మీకు కావాలంటే అర కేజీ బెల్లం, లేదంటే పావు కిలో బెల్లం, పావు కిలో చక్కెర కూడా తీసుకోవచ్చు)
  • పంచదార కరుగుతున్న సమయంలో ఉప్పు, నిమ్మ రసం, యాలకులు వేసి కలపాలి. (నిమ్మ రసం వేయడం వల్ల ఇందులో ఉండే వగరు పోతుంది. యాలకుల వల్ల స్వీట్​కు మంచి ఫ్లేవర్ వస్తుంది)
  • ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకుని 15 నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలి. (మధ్యలో కలపడం వల్ల చక్కెర పూర్తిగా కరిగిపోతుంది)
  • ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లో పెట్టుకుని మరో 10 నిమిషాలు మరగనిస్తే పాకం బంగారు రంగులోకి మారుతుంది.
  • చివర్లో తీగ పాకం వచ్చాక స్టౌ ఆఫ్ చేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి.
  • వేడి చల్లారిన తర్వాత మూత పెట్టి రాత్రంతా పక్కకు పెట్టుకుంటే టేస్టీ ఆమ్లా మురబ్బా రెడీ!

కేక్స్, పఫ్స్ ఇంట్లో చేసినప్పుడు సరిగ్గా రావట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే పర్​ఫెక్ట్​గా రావడమే కాదు టేస్ట్ అదుర్స్!

స్వీట్​ లవర్స్​ ఫేవరెట్​ - వందల ఏళ్ల నాటి "పాల పూరీలు" - ఇలా చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

ABOUT THE AUTHOR

...view details