How to Make Udalu Pulao :ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నానికి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్‌ను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే రాగులు, సజ్జలు, జొన్నలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా ఊదలు కూడా ఆరోగ్యానిచ్చేవే. ఇక ఊదలతో జావ, అన్నం, ఇడ్లీ, ఖీర్, రొట్టెలు, పరోటా, ఉప్మా, ధోక్లా, టిక్కీ, కిచిడీ, ఇలా ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఊదలతో పులావ్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- ఊదలు-ఒక కప్పు
- నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు- రుచికి తగినంత
- జీడిపప్పు-10
- లవంగాలు-2
- యాలకులు-2
- దాల్చిన చెక్క- అంగుళం ముక్క
- సోంపు-చెంచా
- జీలకర్ర-చెంచా
- అల్లం వెల్లుల్లి ముద్ద-చెంచా
- పచ్చిమిర్చి-3 మూడు
- ఉల్లిపాయ-1
- టమాటా-1
- బంగాళదుంప-1
- మిరియాల పొడి- అర చెంచా
- నిమ్మరసం-ఒక చెంచా
- కొత్తిమీర తరుగు-కొద్దిగా
- ఉల్లికాడలు- రెండు
తయారీ విధానం:
- ముందుగా ఊదలను బాగా కడిగి, నీటిలో ఒక అరగంటపాటు నానబెట్టుకోవాలి.
- అలాగే ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లికాడలు, బంగాళదుంపలను సన్నగా చిన్నముక్కలుగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టండి. తర్వాత నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి.
- అనంతరం సోంపు, జీలకర్ర, జీడిపప్పు వేసి ఫ్రై చేయండి.
- జీడిపప్పు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించాలి.
- తర్వాత మిరియాల పొడి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్స్ చేయండి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత టమాటా, బంగాళదుంప, ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- గిన్నెపై మూత పెట్టి కూరగాయలను 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత నానబెట్టుకున్న ఊదలు వేసి రెండు నిమిషాలు వేపండి. ఆపై రెండు కప్పుల నీరు, నిమ్మరసం వేసి కలపండి.
- ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి ఊదలను మెత్తగా ఉడికించుకోవాలి. ఆపై కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ ఊదల పులావ్ మీ ముందుంటుంది.
- ఈ పులావ్ నచ్చితే ఓ సారి ట్రై చేయండి.