How to Make Thokkudu Laddu :అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వెలుగుల పండగ దీపావళి వచ్చేసింది. దివాళీ అనగానే మనందరికీ నోరూరించే మిఠాయిలు గుర్తుకొస్తుంటాయి. సాయంత్రం లక్ష్మీదేవి పూజ అనంతరం.. ఏదైనా స్వీట్ తిని సంతోషంగా బాణసంచా కాలుస్తుంటాం. మరి.. ఈ దీపావళి పండక్కి ఇంట్లో ఏ స్వీట్ రెడీచేయాలా ? అని మీరు ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ కథనం మీ కోసమే.
ఈ సారి ఎంతో కమ్మగా ఉండే తొక్కుడు లడ్డూలు ప్రిపేర్ చేయండి. వీటిని తయారు చేయడం చాలా ఈజీ. ఈ స్టోరీలో చెప్పిన విధంగా తయారు చేస్తే.. అచ్చం పాత కాలం పద్ధతిలో చేసినట్టుగా లడ్డూలు ఎంతో మృదువుగా వస్తాయి. నోట్లో వేసుకోగానే కరిగే ఈ లడ్డూలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇక లేట్ చేయకుండా ఈ తొక్కుడు లడ్డూలను ఎలా తయారు చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో? ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- శనగపిండి-2 కప్పులు
- పంచదార- 2 కప్పులు
- యాలకుల పొడి- టీస్పూన్
- ఉప్పు -చిటికెడు
- ఖర్బూజ గింజలు-కొద్దిగా
- నూనె-డీప్ ఫ్రైకి సరిపడా
- నెయ్యి -టేబుల్‌స్పూన్
- ఫుడ్ కలర్ - చిటికెడు
తయారీ విధానం..
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగ పిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, ఫుడ్ కలర్ వేసి కలపాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ జంతికల కోసం పిండి సిద్ధం చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి జంతికలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేయండి.
- జంతికల గొట్టానికి కాస్త నూనె రాసి పిండి ముద్దని పెట్టండి. నూనె వేడయ్యాక జంతికలు చేసుకోవాలి.
- జంతికలుక్రిస్పీగా కాకుండా.. కాస్త మెత్తగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే జంతికలు సిద్ధం అవుతాయి.
- ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఇప్పుడు పాకం కోసం స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో చక్కెర తగినన్ని నీళ్లు పోసి కరిగించండి.
- కొద్దిగా తీగ పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలపండి. తర్వాత మిక్సీ పట్టుకున్న జంతికలపొడి కొద్దికొద్దిగా వేసుకుంటూ.. ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- ఇందులోనే నెయ్యి, ఖర్బూజ గింజలు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకోవాలి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైనతొక్కుడు లడ్డూలు రెడీ. నచ్చితే ఈ పండగకు మీరు తొక్కుడు లడ్డూలను ఈ విధంగా ట్రై చేయండి.
- ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "ఆమ్లా బర్ఫీ" - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ - టేస్ట్ సూపరంతే!
బియ్యంతో అద్దిరిపోయే స్వీట్ రెసిపీ - ఈ దీపావళికి ఓసారి ట్రై చేయండిలా! - టేస్ట్‌కి ఇంట్లో వారందరూ ఫిదా!