తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అందరికీ ఎంతో ఇష్టమైన "సాఫ్ట్​ మైసూర్ పాక్​"- ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది! - SOFT MYSORE PAK RECIPE

-చుక్క నెయ్యి లేకుండానే అద్భుతమైన రుచి​ -ఇలా చేస్తే నిమిషాల్లోనే రెడీ

Soft Mysore Pak Recipe
How to Make Soft Mysore Pak Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 2:37 PM IST

How to Make Soft Mysore Pak Recipe :స్వీట్​ లవర్స్ ఎంతో ఇష్టంగా తినే మిఠాయిలలో మైసూర్​ పాక్ కూడా ఒకటి. స్వీట్​షాపు నుంచి తీసుకురావడమే ఆలస్యం ఇంట్లో వాళ్లందరూ మైసూర్​ పాక్​ బాక్స్ మొత్తం​ ఖాళీ చేసేస్తారు. అయితే, ఈ టేస్టీ మైసూర్​ పాక్​లలో రెండు రకాలుంటాయి. ఒకటి కాస్త క్రిస్పీగా ఉంటే.. మరొకటి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇంట్లోనే సాఫ్ట్​ మైసూర్​ పాక్​ ఎలా ప్రిపేర్​ చేయాలో చూద్దాం. పండుగలు, శుభకార్యాల సమయంలో ఈ స్వీట్​ ట్రై చేయండి. ఫ్యామిలీలో అందరికీ ఎంతో నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా సాఫ్ట్ మైసూర్​ పాక్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానంపై ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు..

  • చక్కెర-కప్పు
  • శనగపిండి-కప్పు (చక్కెర ఏ కప్పుతో తీసుకుంటే.. అదే కప్పుతో శనగపిండి తీసుకోవాలి)
  • నూనె అరకప్పు
  • కాచి చల్లార్చిన పాలు -అరకప్పు
  • ఉప్పు-చిటికెడు
  • యాలకుల పొడి-టీస్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా ఒక మిక్సీ జార్లో షుగర్​ వేసుకుని పౌడర్​ రెడీ చేసుకోండి.
  • అలాగే ఒక పాన్​లోకి శనగపిండి జల్లించి తీసుకోండి. ఇందులో నూనె పోసి పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ పాన్​ని స్టౌపై పెట్టాలి. స్టౌ మీడియమ్​ ఫ్లేమ్​లో ఉంచుకుని శనగపిండి కలుపుతూ వేయించుకోవాలి. అంటే శనగపిండి ఉడికేటప్పుడు బుడగలు, మంచి స్మెల్​ వచ్చే వరకూ గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి.
  • పిండి కాస్త గట్టిగా మారిన తర్వాత ఇందులో గ్రైండ్​ చేసుకున్న షుగర్​ పౌడర్​ వేసుకుని కలుపుకోవాలి. పంచదార పొడి కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను పోసుకుని బాగా మిక్స్​ చేయాలి.
  • పిండి ఉండలు లేకుండా క్రీమ్​లాగా రెడీ పాన్​కు అంటుకోకుండా సపరేట్​ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఉప్పు, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. చివరగా స్వీట్​ పైన నూనె పైకి తేలెంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఇప్పుడు ఓ బాక్స్​ తీసుకుని అందులో లైట్​గా నూనె అప్లై చేయాలి. ఆ తర్వాత శనగపిండి మిశ్రమాన్ని అందులోకి వేసి సమానంగా స్ప్రెడ్​ చేసుకోవాలి. ఇక స్వీట్​ పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ఈ స్వీట్​ని కట్​ చేసుకోండి. స్వీట్​ను నచ్చిన షేప్​లో కట్​ చేసుకోవడానికి చాకు కాకుండా దారం ఉపయోగిస్తే పీస్​ చెదరకుండా పర్ఫెక్ట్​గా వస్తుంది.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే.. ఎంతో టేస్టీ​ మైసూర్​ పాక్​ రెడీ. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ స్వీట్​ ట్రై చేయండి.

ఈ పండక్కి మీ ఇంట్లో నేతి బొబ్బట్లు చేస్తారా? - మేం చెప్పినట్టు చేస్తే రుచి అమృతమే!

దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్​దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీ​గా చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details