తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పిల్లల లంచ్​ బాక్స్​లోకి టేస్టీ "పెప్పర్​ రైస్" - ఇలా చేశారంటే డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తారు! - Pepper Rice In Telugu

Pepper Rice Recipe : పిల్లలు కొన్ని సార్లు లంచ్​ బాక్స్​ పూర్తిగా తినకుండా ఇంటికి పట్టుకొస్తుంటారు. దీనర్థం.. మీరు పిల్లలకు ఇష్టమైన వంట చేయట్లేదని అర్థం. మీరు ఆరోగ్యం కోసం వండినప్పటికీ.. వారు అది అర్థం చేసుకోలేరు. అందుకే.. మీకోసం సూపర్ రెసిపీ తెచ్చాం. చక్కటి టేస్ట్​తోపాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందీ "పెప్పర్​ రైస్". మరి.. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Pepper Rice Recipe
Pepper Rice Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 18, 2024, 2:20 PM IST

How To Make Pepper Rice Recipe : ఎక్కువ మంది మమ్మీలు పిల్లల లంచ్​ బాక్స్​లోకి రోజూ రొటీన్ అన్నం పెడుతుంటారు. వైట్​ రైస్​ తో ఏదోక కర్రీ పెట్టి పంపిస్తుంటారు. దీంతో.. స్కూల్లో ఇలాంటి భోజనం తినడానికి పిల్లలు అంతగా ఇష్టపడరు. అందుకే.. కొన్నిసార్లు అన్నం కొంచెం తిని, మిగిలి బాక్స్​ మొత్తం అలాగే ఇంటికి పట్టుకొస్తుంటారు. అందుకే.. పిల్లల లంచ్​ బాక్స్​లోకి ఎప్పుడూ వివిధ రకాల వెరైటీ రెసిపీలను పెడుతుండాలి. ఇలాంటి ఒక లంచ్​ బాక్స్​ రెసిపీని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. అదే పెప్పర్​ రైస్​. ఒక్కసారి ఈ విధంగా చేశారంటే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా బాక్స్​ మొత్తం ఖాళీ చేస్తారు. సింపుల్​గా.. నిమిషాల్లోనే ఈ రైస్​ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

పెప్పర్​ రైస్​ కోసం కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - గ్లాసు
  • నూనె - తగినంత
  • ఉల్లిపాయ -1
  • ఎండుమిర్చిలు-2
  • టేబుల్​స్పూన్​ మిరియాలు
  • జీలకర్ర- అర టీస్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • కరివేపాకు-1
  • టమాటా-1
  • పసుపు-అరటీస్పూన్
  • ఇంగువ- చిటికెడు
  • జీడిపప్పులు-కొద్దిగా

పెప్పర్​ రైస్​ తయారీ విధానం..

  • ముందుగా బియ్యం రెండు మూడుసార్లు కడిగి, నానబెట్టకుండా అన్నాన్ని పొడిపొడిగా వండుకోండి.
  • ఇప్పుడు పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసుకోండి. మీకు నచ్చితే ఈ రైస్​ చేయడానికి నెయ్యిని కూడా వాడుకోవచ్చు.
  • తర్వాత గిన్నెలో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి వేపండి. ఎండుమిర్చి, మిరియాలు వేగిన తర్వాత వాటిని తీసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
  • అదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయండి. వెల్లుల్లి గోల్డెన్ కలర్​లోకి మారిన తర్వాత ఇంగువ, జీడిపప్పులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • అలాగే టమాటాలు వేసి కొద్దిగా ఉడకనివ్వండి. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేపండి.
  • ఇప్పుడు ఉడికించుకున్న అన్నం, కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండుమిర్చి, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
  • రైస్​ దింపుకునే ముందు కాస్త కొత్తిమీర చల్లి దింపుకుంటే సరిపోతుంది.
  • అంతే.. ఇలా సింపుల్​గా చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే మీ ముందు వేడివేడి పెప్పర్​ రైస్​ ఉంటుంది.
  • ఈ రైస్​ టేస్ట్​ ఒక్కసారి చూశారంటే, తప్పకుండా మళ్లీ ప్రిపేర్​ చేసుకుంటారు.
  • నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ రైస్​ తయారు చేసేయండి.

ఇవి కూడా చదవండి :
పిల్లలు లంచ్ బాక్స్ తినకుండా తెస్తున్నారా? - ఇలా 'ఆలూ రైస్' చేసి పెట్టండి! - బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు

పిల్లలు రోజూ వైట్​ రైస్​ ఎలా తింటారు మమ్మీ? - ఈ కలర్​ ఫుల్​ 'గార్లిక్ రైస్' పెట్టండి - మెతుకు మిగలదు!

ABOUT THE AUTHOR

...view details