How to Make Oats Omelette Recipe :ఇటీవల కాలంలో ఓట్స్‌తో చేసిన బ్రేక్‌ఫాస్ట్ తినే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, పూరి వంటివి తినడం కంటే.. కాస్త హెల్దీ ఫుడ్ట్రై చేయాలని ఓట్స్‌ని డైట్లో ఒక భాగం చేసుకుంటున్నారు జనాలు. అయితే, ఎప్పుడూ ఓట్స్‌తో ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి రెసిపీలు తినాలంటే బోర్ కొడుతుంది. కాగా కాస్త వెరైటీగీ ఓట్స్‌తో ఆమ్లెట్ ప్రిపేర్ చేయండి. ఓట్స్‌తో ఆమ్లెట్ కూడా వేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండీ.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఓట్స్తోఆమ్లెట్ప్రిపేర్ చేస్తే ఎంతో రుచికరంగా వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆమ్లెట్ వేస్తే ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- ఓట్స్ -కప్పు
- పాలు-సరిపడా
- ఎగ్స్ -మూడు
- రుచికి సరిపడా ఉప్పు
- మిరియాలపొడి -పావు టీస్పూన్
- ఉల్లిపాయ తరుగు -కొద్దిగా
- క్యాప్సికం తరుగు-కొద్దిగా
- టమాటా-1
- పచ్చిమిర్చి-2
- కొత్తిమీర తరుగు
- క్యారెట్ తురుము
- నూనె సరిపడా
తయారీ విధానం :
- ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఓట్స్ తీసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- తర్వాత ఇందులో పాలు పోసుకుంటూ దోశల పిండిలాఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. (ఇక్కడ మీరు పాలకు బదులుగా నీళ్లు కూడా వాడుకోవచ్చు)
- ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎగ్స్ పగలగొట్టి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి.
- తర్వాత ఓట్స్ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి.
- అలాగే ఉప్పు వేసుకుని మిక్స్ చేయాలి.
- తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమం వేసి మిక్స్ చేయాలి.
- ఇప్పుడు స్టౌపై దోశ పాన్ పెట్టి ఆయిల్ వేయండి.
- నూనె వేడయ్యాక ఓట్స్ పిండి కాస్త మందంగా ఆమ్లెట్‌లా వేసుకోండి.
- పాన్‌పై మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి.
- ఓట్స్ ఆమ్లెట్ రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే.. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఆమ్లెట్లు మీ ముందుంటాయి.
- నచ్చితే మీరు కూడా ఓట్స్‌తో ఇలా ఆమ్లెట్ ఓ సారి ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే "జొన్న దిబ్బరొట్టెలు"- ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ - షుగర్ పేషెంట్స్ హాయిగా తినొచ్చు!
హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ "మినప ఆవిరి కుడుములు"- బొంబాయి చట్నీ కాంబినేషన్‌తో సూపర్ టేస్ట్!