తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ముక్క మెత్తగా ఉండే సూపర్​ టేస్టీ "మటన్​ ఫ్రై" - ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా లాగిస్తారు! - MUTTON FRY RECIPE

- ఈ సండే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి

How to Make Mutton Fry
How to Make Mutton Fry (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 10:34 AM IST

How to Make Mutton Fry :మటన్​ ఫ్రై చాలా మందికి ఇష్టం. కానీ.. ప్రిపరేషన్ దగ్గరే చిక్కు వస్తుంది. వంట పూర్తయిన తర్వాత ముక్క నోట్లో పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. దీంతో.. నమలలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితి మీరు కూడా ఫేస్ చేశారా? అయితే.. ఈ స్టోరీ తప్పక మీరు చదవాల్సిందే. ఇక్కడ చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే.. మటన్​ఫ్రై చాలా సాఫ్ట్​గా, ఎంతో రుచికరంగా తయారైపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా, ఈజీగా తినేస్తారు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా టేస్టీగా మటన్​ ఫ్రై ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • మటన్ - అరకేజీ
  • లవంగాలు-3
  • దాల్చినచెక్క-1
  • యాలకులు-3
  • పసుపు-పావుటీస్పూన్
  • కారం -రుచికి సరిపడా
  • గరం మసాలా-టీస్పూన్
  • ధనియాల పొడి-టీస్పూన్​
  • ఉప్పు -రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు- కొద్దిగా
  • పుదీనా తరుగు- కొద్దిగా
  • ఉల్లిపాయలు-2
  • పచ్చిమిర్చి-4
  • నూనె -2 టేబుల్​స్పూన్లు
  • కరివేపాకు-2

తయారీ విధానం :

  • ముందుగా మటన్​ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మటన్​ ఉడికించుకోవడం కోసం స్టౌపై కుక్కర్​ పెట్టండి.
  • ఇందులో నూనె పోసి వేడి చేయండి. నూనె వేడయ్యాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాసేపు వేపండి. తర్వాత శుభ్రంగా కడిగిన మటన్​ వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి.
  • తర్వాత మూడు గ్లాసుల నీటిని పోసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్లో మటన్​ 10 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోండి.
  • మటన్​ మెత్తగా ఉడికిన తర్వాత ముక్కలనుసూప్​లో నుంచి ప్లేట్లోకి తీసుకోండి.
  • కుక్కర్​లో మిగిలిన నీటితో మటన్​ సూప్​ తయారు చేసుకోవచ్చు.
  • ఇప్పుడు మటన్​ ఫ్రై చేయడం కోసం స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో కొద్దిగా ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి కలపండి.
  • ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్​ చేయండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో 5 నిమిషాలు అలా ఉంచండి. తర్వాత కొత్తిమీర, పుదీనా పైన వేసి బాగా మిక్స్​ చేసి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో కమ్మగా, మృదువుగా ఉండే మటన్​ ఫ్రై మీ ముందుంటుంది.
  • నచ్చితే ఈ విధంగా మటన్​ ఫ్రై ఇంట్లో ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

ఘుమఘుమలాడే "తెలంగాణ స్టైల్ తలకాయ కూర" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అదుర్స్!

దసరా స్పెషల్​: ఘుమఘుమలాడే మద్రాస్​ స్టైల్​ "మటన్​ బకెట్​ బిర్యానీ" - తిన్నారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!!

ABOUT THE AUTHOR

...view details