తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మరమరాలతో చాట్​ రొటీన్​ - ఇలా సూపర్ "బర్ఫీ" చేయండి - టేస్ట్​ అద్దిరిపోతుంది!

- రెగ్యులర్​ స్వీట్స్​ను మించిన టేస్ట్​ - కేవలం నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు

How to Make Maramarala Barfi
How to Make Maramarala Barfi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

How to Make Maramarala Barfi :మరమరాలతో చాట్​, మిక్చర్​, ముంత మసాలా, పోహా, దోశలు, ఇడ్లీలు, లడ్డూ.. ఇలా ఒక్కటేమిటి ఎన్నోరకాల వంటకాలు ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే.. వీటితో చేసే ఏ రెసిపీ అయినా టేస్ట్​ చాలా బాగుంటుంది. కానీ.. వాటితో స్వీట్ కూడా చేయొచ్చని మీకు తెలుసా? అది కూడా నిమిషాల్లోనే బర్ఫీ సిద్ధమవుతుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఈ స్వీట్​ చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. మరి, ఈ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

మరమరాల బర్ఫీకి కావాల్సిన పదార్థాలు:

  • మరమరాలు - 2 కప్పులు
  • జీడిపప్పు పలుకులు - 15
  • పంచదార - అర కప్పు
  • యాలకులు - 4
  • కాచి చల్లార్చిన పాలు - పావు కప్పు
  • పిస్తా - 5
  • బాదం - 5

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మరమరాలు, జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీజార్​ తీసుకుని అందులోకి పంచదార, యాలకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని పంచదారను జల్లించుకోవాలి. ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ పంచదార కరిగే వరకు కలుపుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సీ జార్​లో వేయించిన మరమరాలు, జీడిపప్పు పలుకుసు వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా వీటిని వేయించుకోవడం వల్ల పచ్చి వాసన పోవడంతో పాటు స్వీట్​ రుచికరంగా ఉంటుంది.
  • ఇలా మిక్సీ పట్టుకున్న మరమరాల మిశ్రమాన్ని జల్లించుకోవాలి. పొడి జల్లించుకున్న తర్వాత పంచదార మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఆ సమయంలో మిగిలిన పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ ముద్దగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి సన్నగా కట్​ చేసిన పిస్తా, బాదం పప్పు పలుకులు వేసుకోవాలి.
  • అనంతరం చేతికి నెయ్యి అప్లై చేసుకుని మిశ్రమాన్ని సాఫ్ట్​గా ముద్దగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఓ స్టీల్​ లేదా ప్లాస్టిక్​ బాక్స్​ తీసుకుని దాని లోపల నెయ్యి రాసుకోవాలి. ఆ తర్వాత కలుపుకున్న మరమరాల మిశ్రమాన్ని సమానంగా పరిచి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి.
  • గంట తర్వాత తీసి కావాల్సిన షేప్​లో కట్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మరమరాల బర్ఫీ రెడీ.
  • నిమిషాల్లో రెడీ అయ్యే ఈ స్వీట్​ను మీరూ ఓసారి ట్రై చేయండి..

సూపర్ క్రంచీ "పల్లీ కొబ్బరి పట్టిలు"- ఈ విధంగా చేస్తే​ అద్భుతంగా వస్తాయి!

నోరూరించే "సీతాఫల్​ ఐస్​క్రీమ్​" - ఇలా చేస్తే టేస్ట్​ వేరే లెవల్​ బాస్​ - ఓసారి ట్రై చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details