తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

దసరా స్పెషల్​ - కరకరలాడే "కారం బూందీ" - పక్కా కొలతలతో ఇంట్లోనే చేసుకోండి - టేస్ట్​ సూపర్​! - How to Make Kara Boondi at Home

Kara Boondi Recipe in Telugu: బతుకమ్మ, దసరా, దీపావళి.. ఇలా పండగలు వరసగా ఉన్నాయి. ఇక ఈ పండగల సమయంలో చాలా మంది పిండి వంటలు చేస్తుంటారు. అలాంటి వాటిలో కారం బూందీ ఒకటి. మరి ఈ కారం బూందీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Kara Boondi Recipe in Telugu
Kara Boondi Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 1, 2024, 3:02 PM IST

Kara Boondi Recipe in Telugu:కారం బూందీ.. కరకరలాడుతూ తినేకొద్దీ తినాలనిపించే ఓ స్నాక్​. పండగ, ఫంక్షన్​, పెళ్లి.. వేడుక ఏదైనా ఇది కచ్చితంగా ఉండాల్సిందే. అయితేఇది చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని కొందరు.. మనం చేస్తే సరిగ్గా రాదని మరికొందరు అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే తినాలనిపించినప్పుడు స్వీట్​ షాప్స్​కు వెళ్లి తెచ్చుకుంటుంటారు. అయితే ఇకపై బూందీ తినాలంటే కొనే అవసరం లేకుండా.. ఇంట్లోనే ఈ కొలతలతో చేస్తే సూపర్​గా వస్తుంది. గుండ్రంగా, కారంగా కరకలాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • 200 గ్రాముల శనగపిండి
  • 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ
  • ఒక టీ స్పూన్ ఉప్పు
  • 300 మిల్లీ లీటర్ల నీరు
  • పావు కప్పు పల్లీలు (వేరుశెనగ)
  • పావు కప్పు జీడిపప్పు
  • 5 రెబ్బల కరివేపాకు
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా
  • ఒక టీ స్పూన్ కారం
  • కొద్దిగా నల్ల ఉప్పు
  • రుచికి సరిపడా ఉప్పు
  • పావు టీ స్పూన్ చాట్ మసాలా

తయారీ విధానం

  • ముందుగా శనగపిండిని తీసుకుని జల్లెడ పట్టుకోవాలి. దీంతో పాటు బొంబాయి రవ్వను మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పుడు శనగపిండిలో బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ ఉప్పు​, కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఎలాంటి గడ్డలు లేకుండా బాగా కలపాలి. (పిండిని సరిగ్గా కలుపుకోకపోతే గుండ్రంగా రావు)
  • ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇప్పుడు మరిగే నూనెకు రెండు అంగళాల దూరంలో ఓ జల్లి గంట పెట్టి దానిపై పిండిని నెమ్మదిగా కొద్దికొద్దిగా పోయాలి. ఆ తర్వాత గరిటెతో చిన్నగా తిప్పుతుంటే బూందీ నూనెలోకి పడుతుంది.
  • ఇలా లేత గోధుమ రంగులోకి రాగానే కడాయి నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో పల్లీలు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఇదే విధంగా జీడిపప్పు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కారం, నల్ల ఉప్పు, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బూందీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

బేకరీ స్టైల్​ "దిల్​పసంద్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్​ సూపర్​గా ఉంటుంది! - Dilpasand Recipe

యమ్మీ యమ్మీగా "ఫ్రైడ్ ఎగ్ సలాడ్" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్ అంతే! - Fried Egg Salad Recipe

ABOUT THE AUTHOR

...view details