తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్​" - ఇలా చేస్తే అచ్చం స్వీట్​ షాప్​ టేస్ట్​! - KALAKAND RECIPE

- ఈ కొలతలతో తయారు చేస్తే పర్ఫెక్ట్​ రుచి

Kalakand Recipe
How to Make Kalakand Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2024, 10:07 AM IST

How to Make Kalakand Recipe :స్వీట్లంటే అందరికీ ఇష్టమే. స్వీట్​ బాక్స్​ ముందు పెడితే చాలు.. ఒకటికి రెండు మిఠాయిలు తిని మనసు తృప్తి పరుచుకుంటారు. ఇక పండుగలు, శుభకార్యలు సమయంలో ఇంట్లో తప్పకుండా ఏదోక స్వీట్​ తయారుచేస్తుంటారు మహిళలు. కానీ.. స్వీట్​షాపుల్లో దొరికే తీయటి కలాకండ్​ రెసిపీ మాత్రం చాలా మంది ట్రై చేయరు. ఇంట్లో చేస్తే కలాకండ్​ సరిగా రాదని, కుదరదని వెనకడుగు వేస్తుంటారు. అందుకే మీ కోసమే ఈ స్టోరీ. పక్కా కొలతలతో ఎంతో ఈజీగా ఇంట్లోనే కలాకండ్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. కాస్త ఓపికగా చేసుకుంటే.. అచ్చం స్వీట్​షాప్​ స్టైల్ కలాకండ్ మీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా కమ్మటి కలాకండ్​ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • చిక్కని పాలు- లీటర్
  • పంచదార-100 గ్రాములు
  • నెయ్యి- 2 టేబుల్​స్పూన్లు
  • నిమ్మరసం - 2 టేబుల్​స్పూన్లు (కొన్ని నీళ్లలో నిమ్మరసం కలుపుకోవాలి)
  • యాలకులపొడి-అరటీస్పూన్

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ పై మందపాటి కడాయి పెట్టుకోండి. ఇందులో చిక్కటి పాలు పోయండి. కలాకండ్​ మరింత టేస్టీగా ఉండటానికి మీరు ఫుల్​ క్రీమ్​ మిల్క్​ కూడా ఉపయోగించవచ్చు.
  • పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇలా పాలు మరుగుతున్నప్పటి నుంచి కొద్దిగా చిక్కగా మారేంత వరకు మధ్యమధ్యలో గరిటెతో మిక్స్​ చేస్తూనే ఉండాలి.
  • పాలపైన వచ్చే మీగడ కడాయికి అతుక్కోకుండా గరిటెతో పాలలోకి మిక్స్​ చేస్తూ బాగా మరిగించాలి.
  • పాలు సగం కంటే తక్కువగా మారిన తర్వాత స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి నిమ్మరసం వేయాలి.
  • ఇప్పుడు పాలు విరిగిపోతాయి. పాలు విరిగిపోకపోతే మరికొద్దిగా నిమ్మరసం కలపండి.
  • తర్వాత పాలలో కొద్దికొద్దిగా చక్కెర వేసి బాగా కలపాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి బాగా మిక్స్​ చేయాలి.
  • కలాకండ్​ ప్రిపేర్​ అయిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి. ఇప్పుడు ఒక కేక్​ పాన్​లో కొద్దిగా నెయ్యి వేసి రాయండి.
  • పాన్​లో కలాకండ్​ వేసి మొత్తం స్ప్రెడ్​ చేయండి.
  • పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో కట్​ చేసుకుంటే నోరూరించే కలాకండ్​ రెడీ.
  • ఇలా సింపుల్​గా ఇంట్లో చేసుకుంటే స్వీట్​షాప్​ స్టైల్​ కలాకండ్ తయారైపోతుంది.
  • ఈ స్వీట్​ నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details