How to Make Egg Vegetables Biryani : ఘుమఘుమలాడే బిర్యానీ అంటే నాన్‌వెజ్ లవర్స్ అందరికీ ఇష్టమే! ఇక చాలా మంది నెలకు రెండుమూడు సార్లు బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు. అయితే, ఇంట్లో చికెన్, మటన్ బిర్యానీఎన్నోసార్లు చేసుకుంటుంటాం. అలాగే ఎగ్ బిర్యానీ కూడా ట్రై చేసి ఉంటాం. కానీ ఎప్పుడైనా ఎగ్ వెజిటబుల్ బిర్యానీ చేశారా? లేదు అంటే మాత్రం ఇలా తప్పకుండా ఓ సారి ప్రయత్నించండి. ఈబిర్యానీబ్యాచిలర్స్ కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే ఎగ్ వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- ఉడికించిన కోడి గుడ్లు - 6
- క్యారెట్ - 1
- బీన్స్ - 10
- టమాటాలు- 2
- ఉల్లిపాయలు - 4
- బియ్యం - అర కేజీ
- పసుపు - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- గరం మసాలా - 1 టీ స్పూన్
- కారం - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - సరిపడా
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు
- కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
- పెరుగు - 1 కప్పు
- లవంగాలు - 5
- యాలకులు - 3
- షాజీరా - అర టీ స్పూన్
- అనాస పువ్వు - 1
- పచ్చిమిర్చి చీలికలు - కొన్ని
తయారీ విధానం:
- ముందుగా కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి కొద్దిగా గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి.
- అలాగే రైస్ శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీలోకి కావాల్సిన క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. వేడివేడి నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- అనంతరం స్టౌపై బిర్యానీ చేయడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టండి. ఇందులో 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస పువ్వు వేసి వేపండి.
- ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. క్యారెట్, బీన్స్, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కాసేపు మగ్గించండి. ఆపై పెరుగు వేసి కలపండి.
- ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి కలపండి.
- అనంతరం ఇందులో వేడివేడి 4 గ్లాసుల నీరు, నిమ్మరసం పోసుకోండి. గిన్నెపై మూత పెట్టి 5 నిమిషాలు మరిగించుకోండి.
- ఆపై బియ్యం వేసి కలపండి. బియ్యం కాస్త ఉడికిన తర్వాత మరోసారి కలిపి ఉడికించిన గుడ్లు వేయండి.
- బిర్యానీ తయారైన తర్వాత కాస్త కొత్తిమీర పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు ఉంచి స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ వెజిటబుల్ బిర్యానీ మీ ముందుంటుంది.
- నచ్చితే ఇలా బిర్యానీ ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
చిరుధాన్యాల పులావ్ ఇలా సింపుల్‌గా చేసేయండి - ఎంతో అద్భుతంగా ఉంటుంది
బిర్యానీ రుచికి అదొక్కటే కారణం - తెలిస్తే ఆశ్చర్యపోతారు!