How to Make Chicken Chaaps Recipe : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. ఇవాళ కనుమ. పూజలు వ్రతాలు ముగించుకున్న భక్తులంతా ఇవాళ నాన్వెజ్ తింటారు. అయితే, చికెన్, మటన్ కర్రీలను ఎప్పుడూ మన స్టైల్లో వండుకోవడం కామన్. అలా కాకుండా ఈ సారి కర్ణాటక స్పెషల్ చికెన్ చాప్స్ రెసిపీ ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ గ్రీన్ కలర్లో ఎంతో రుచిగా ఉంటుంది. బగారా రైస్, వైట్ రైస్, చపాతీ, పూరీ ఇలా వేటిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీ చికెన్ చాప్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
చికెన్ చాప్స్ కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు :
- చికెన్- అరకేజీ
- ఉల్లిపాయలు -2
- టమాటాలు - 2
- నిమ్మరసం
- పసుపు - అర టీ స్పూన్
- రుచికి సరిపడా - ఉప్పు
- కారం- 1 టేబుల్ స్పూన్
- గరం మసాలా - టీ స్పూన్
- అల్లం ముక్కలు-2 చిన్నవి
- వెల్లుల్లి రెబ్బలు-15 (పొట్టుతీసినవి )
- కొత్తిమీర తరుగు - కప్పు
- పుదీనా తరుగు - కప్పు
- పెరుగు - అరకప్పు
- మెంతి ఆకు తరుగు - 2 కప్పులు
- ధనియాలు - టేబుల్ స్పూన్
- వేపిన శనగపప్పు - టేబుల్ స్పూన్
- గసగసాలు - అర టేబుల్ స్పూన్
- యాలకులు - 4
- లవంగాలు - 6
- మిరియాలు-10
- దాల్చినచెక్క
చికెన్ కర్రీ ప్రిపరేషన్ :
- ముందుగా చికెన్ స్మెల్ రాకుండా నీటిలో కాస్త ఉప్పు వేసి కడగండి. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ వేసి ఇందులో కొద్దిగా నూనె, పెరుగు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపండి. అనంతరం చికెన్ 30 నిమిషాలు అలా వదిలేయండి.
- ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా సన్నగా కట్ చేసుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి వేపండి. ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, వేపిన శనగపప్పు, గసగసాలు ఒక్కోటిగా వేసి వేపండి.
- ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత మెంతి ఆకు తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి వేపండి.
- ఆకులు మగ్గిన తర్వాత మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినవ్వండి. ఆపై మిక్సీ గిన్నెలో వేసి కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.
- ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో ఉల్లిపాయ తరుగు వేసి వేపండి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత కప్పు మెంతి తరుగు వేసి మగ్గించండి. అనంతరం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలపండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు, కారం, గరం మసాలా వేసి కలపండి.
- టమాటాలపైన స్కిన్ సెపరేట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి మిక్స్ చేయండి.
- ఇందులో కప్పున్నర నీళ్లు యాడ్ చేసి మధ్యమధ్యలో కలుపుతూ కర్రీలో ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి.
- అనంతరం కాస్త కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మిక్స్ చేయండి.
- ఇంతే ఇలా సింపుల్గా చేసుకుంటే ఘుమఘుమలాడే చికెన్ చాప్స్ రెసిపి మీ ముందుంటుంది.
- నచ్చితే మీరు కూడా ఈ కమను రోజు ఇలా ట్రై చేయండి.
"రాయలసీమ స్టైల్ నాటుకోడి వేపుడు" - సంక్రాంతికి ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవల్!
"ఆంధ్రా స్టైల్ నాటుకోడి బిర్యానీ"- ఈ సంక్రాంతికి మరింత స్పైసీగా!