తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎప్పడూ ఒకేరకమైన పూరీ ఏం బాగుంటుంది? - ఈసారి బెంగాలీ స్టైల్​ "రాధాభల్లబి పూరీలు" చేయండి - టేస్ట్​ సూపర్​! - How to Make Radhaballavi Poori

Radhaballavi Poori: రోజూ పూరీని రొటీన్​గా తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి బెంగాలీ స్టైల్​లో పూరీ చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

how to make radhaballavi poori
how to make radhaballavi poori (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 3:02 PM IST

How to Make Radhaballavi Poori:పూరీ.. చాలా మంది బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్స్​లో ఒకటి. కేవలం టిఫెన్​గా మాత్రమే కాకుండా.. పండగల టైమ్​లో, ఇతర సందర్భాల్లో, తినాలని అనిపించినప్పుడు కొంతమంది పూరీలు ప్రిపేర్ చేసుకొని తింటుంటారు. ఇంకా వానాకాలం అయితే, వేడివేడిగా పూరీలను చికెన్ కర్రీతో ఆస్వాదిస్తుంటారు కూడా. ఇలా ఎప్పుడు చేసినా సరే.. రొటీన్​గా చేస్తుంటారు. అలా కాకుండా బెంగాలీ స్టైల్​లో రాధా భల్లభి పూరీలను ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది. మరి బెంగాలీ పూరీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • మైదా పిండి - పావు కిలో
  • నూనె - 2 టీ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మినపప్పు - అర కప్పు
  • అల్లం ముక్కలు - 1 టీ స్పూన్​
  • పచ్చిమిరపకాయలు - 8
  • నూనె - ఒకటిన్నర టేబుల్​ స్పూన్​
  • ఉల్లి గింజలు(కలోంజి) - పావు చెంచా
  • సోంపు - పావు చెంచా
  • ఇంగువ - 2 చిటికెల
  • పసుపు - పావు చెంచా
  • కారం - ఒక చెంచా
  • వేయించిన జీలకర్ర పొడి - అర చెంచా
  • రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో మైదా పిండి, నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • తర్వాత కొద్దిగా నీటిని పోసుకుంటూ ఎక్కువసేపు కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముద్దపై తడి క్లాత్​ కప్పి 30 నిమిషాల పక్కకు పెట్టుకోవాలి.
  • 4 గంటల ముందుగానే మినపప్పును నానబెట్టుకుని స్మూత్​గా గట్టిగా మిక్సీ పట్టాలి.
  • మరో మిక్సీలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
  • మరోవైపు స్టౌ ఆన్ చేసి గిన్నె పెట్టి వేడయ్యాక.. నూనె, ఉల్లిగింజలు, సోంపు, వేసి వేగనివ్వాలి.
  • ఆ తర్వాత ముందుగానే పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చీ పేస్ట్ వేసి వేగనివ్వాలి.
  • అనంతరం ఇందులోనే ఇంగువ, పసుపు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి.
  • ఇవన్నీ వేగాక గ్రైండ్ చేసుకున్న మినపపిండిని వేసి పాన్ నుంచి విడిపోయే వరకు మీడియం ఫ్లేమ్​లో బాగా కలపాలి.
  • సుమారు 15 నిమిషాల తర్వాత గట్టి ముద్దలా అవుతుంది. తర్వాత దీనిని పక్కను పెట్టుకుని చల్లారపెట్టుకోవాలి.
  • పూరీ పిండిని ముద్దలుగా చేసుకుని వాటిపై పొడి పిండిని చల్లుకోవాలి.
  • పిండి ముద్దను చేతి మణికట్టు సాయంతో ఫ్లాట్​ చేసుకుని ముందే రెడీ చేసుకున్న మినపపిండి మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మిశ్రమం బయటికి రాకుండా అంచులను మూసి మళ్లీ ఉండలుగా చేసుకోవాలి.
  • అనంతరం పొడి పిండిని తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి.
  • మరోవైపు స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనెను పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె బాగా వేడయ్యాక అందులో పూరీలను వేస్తే అదిరిపోయే రాధాభల్లభి పూరీ రెడీ!

పప్పు నానబెట్టేది లేదు, రుబ్బేది లేదు - క్షణాల్లో అద్దిరిపోయే దోశలు వేసుకోవచ్చు! - INSTANT DOSA MIX Recipe

"ఆంధ్ర స్టైల్​ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది! - Mutton Curry Recipe

ABOUT THE AUTHOR

...view details