How To Make Aloo Palak Recipe :ఆకు కూరలతో కావాల్సినం ఆరోగ్యం లభిస్తుంది. ఆలుగడ్డలో కావాల్సినంత టేస్ట్ దొరుకుతుంది. ఈ రెండిటినీ మిక్స్ చేసి ప్రిపేర్ చేసే.. సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాం. అదే ధాభా స్టైల్ "ఆలూ పాలక్ కర్రీ". దీనిని ప్రిపేర్ చేయడానికి పెద్దగా సమయం అవసరం లేదు. ఎక్కువగా పదార్థాలు కూడా అవసరం లేదు. కానీ.. రుచి మాత్రం అద్దిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? నోరూరించే ఆలూ పాలక్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పాలకూర - 200 గ్రాములు
- ఎండుమిర్చి-4
- నూనె
- జీలకర్ర- టేబుల్‌స్పూన్
- ఉల్లిపాయ-1
- ఉప్పు రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్‌స్పూన్
- బంగాళా దుంపలు-పావుకేజీ
- వెల్లుల్లి-5
- పచ్చిమిర్చి-3
- కారం- టీస్పూన్
- ధనియాలపొడి-టీస్పూన్
- జీలకర్రపొడి-టీస్పూన్
- నెయ్యి- 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం :
- ముందుగా పాలకూర ఆకులను తెంపి శుభ్రంగా రెండు మూడు సార్లు నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత మరొక పాత్రలో బంగాళాదుంపలను ఉడికించాలి. వాటిపైన ఉన్న పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో నీళ్లు పోసి వేడిచేయాలి. తర్వాత పాలకూర ఆకులు వేసి 4 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత ఆకులను స్ట్రెయినర్ సహాయంతో వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో వేసుకోవాలి.
- ఇలా పాలకూరను కూల్ వాటర్లోకి తీసుకోవడం ద్వారా, కర్రీ రంగు మారదు.
- పాలకూరని ఉడికించిన నీటిని తిరిగి ఉపయోగించకండి.
- పాలకూర ఆకులను మిక్సీ జార్లో వేసుకుని, కాసిన్ని నీళ్లు కలిపి మెత్తని ఫ్యూరీలాగా (పేస్ట్) చేసుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో ఆయిల్ పోసి ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
- ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేయండి.
- తర్వాత పాలక్ ఫ్యూరీ వేసి మూత పెట్టి ఉడికించండి. నూనె పైన కనిపించేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసి సన్నని మంటమీద 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి.
- అనంతరం స్టౌ ఆఫ్ చేయడానికి ముందు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది.
- ఎంతో రుచికరమైన ధాభా స్టైల్ ఆలూ పాలక్ కర్రీ మీ ముందు సిద్ధంగా ఉంటుంది.
- మీరు కూడా ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు.