House Cleaning Tips in Telugu:సంక్రాంతి పండగ సమీపిస్తోంది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు ఇంటిని శుభ్రం చేసేందుకు సన్నద్ధమవుతుంటారు. బట్టల నుంచి వస్తువుల వరకు అన్నింటిని క్లీన్ చేస్తుంటారు. అయితే క్లీనింగ్ సమయంలో చాలా మంది హడావుడి పడిపోతుంటారు. ఒక్కరోజులోనే అయిపోవాలనే కారణంతో పైపైనే క్లీన్ చేస్తుంటారు. ఫలితంగా కొన్ని రోజులకే ఇళ్లు మొత్తం దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. కాబట్టి శుభ్రత విషయంలో హడావుడి పడకుండా ఈ టిప్స్ పాటిస్తే ఇళ్లు తళుక్కున మెరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
లివింగ్ రూమ్:ఒక్కరోజులోనే ఇల్లంతా పూర్తి చేసేయాలన్న తొందర వద్దని నిపుణులు అంటున్నారు. అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి, ప్లాన్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. ఇంటిని శుభ్రం చేసే ముందు డోర్‌మ్యాట్‌లు, కర్టెన్లు తీసేయమంటున్నారు. తర్వాత ప్రతి గదిలోనూ వాడనివీ, పడేయాల్సిన వాటిని తీసేస్తే.. పని తేలిగ్గా పూర్తవుతుంది. కాబట్టి, లివింగ్ రూమ్ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయమని చెబుతున్నారు.
బెడ్రూమ్:లివింగ్ రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బాత్రూమ్స్లో ఉన్న షెల్ఫ్‌లు సర్దమని చెబుతున్నారు. ఆ తర్వాత ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగించే సహజ లేదా మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులను వేసి అలా కొద్దిసేపు ఉంచమంటున్నారు. తర్వాత బెడ్రూమ్ క్లీనింగ్ చేయమంటున్నారు. బెడ్రూమ్లోని ఒక్కో అరనీ శుభ్రం చేసుకుంటూ.. మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత మార్చాలనుకున్నవి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మార్చేస్తే సరిపోతుందని అంటున్నారు. అనవసరంగా ఉన్నవీ, వాడని వాటిని ఓ సంచి అట్టపెట్టెలో పెట్టి.. ఎవరికైనా ఇచ్చేస్తే మంచిదంటున్నారు. అలా కాకుండా పక్కన పెట్టేసుకుంటూ వెళితే వాటిని తీయడం మరో పనవుతుందని చెబుతున్నారు.