History Behind Names of Districts in Telugu States :చరిత్ర గమనిస్తే మనం నివసించే ప్రాంతానికి ఆ పేరు పెట్టడం వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పేరు పెట్టడం వెనుక అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, అక్కడ దొరికే పదార్థాలు, భౌగోళిక స్వరూపం, పరిపాలించిన రాజుల పేర్లు వంటి వివిధ అంశాలు కారణం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మనం పిలుచుకునే కొన్ని జిల్లాల పేర్లు ఒకప్పుడు వేరే పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఇంతకీ ఆ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏవీ? వాటికి ఆ పేర్లు పెట్టడం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
బెజవాడ :
విజయవాడని బెజవాడ అంటారని మనలో చాలా మందికి తెలుసు! ఈ ప్రాంతానికి బెజవాడ పేరు రావడం వెనుక ఓ చరిత్ర ఉంది. అదేంటంటే పూర్వం కృష్ణవేణి (కృష్ణా నది) బంగాళాఖాతం సముద్రంలో కలవడం కోసం ఈ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కృష్ణవేణి నదికి పర్వతాలు అడ్డంగా వచ్చాయి. దీంతో కృష్ణమ్మ అర్జునున్ని వేడుకోగా అప్పుడు అర్జునుడు ఆ పర్వతాలకు రంధ్రం (బెజ్జం) చేశాడట. దీంతో అప్పటి నుంచి ఈ ప్రాంతానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చింది. అనంతరం అది బెజవాడగా మారి విజయవాడగా మారింది.
గర్తపురి :
మిర్చి అనగానే మనందరికీ ఘాటుగా ఉండే గుంటూరు మిర్చి గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని గర్తపురిగా పిలిచేవారు.
గడప :
కొన్నేళ్ల క్రితం ఎవరైనా తిరుమల వెళ్లాలంటే గడప ప్రాంతం మీదునే వెళ్లేవారట. ఈ ప్రాంతం తిరుమలకు ద్వారంగా ఉండేదని చెబుతుంటారు. కాలక్రమంలో గడప కాస్త కడప జిల్లాగా మారింది.
కోకనాడ :
డచ్ వారు భారత దేశాన్ని పరిపాలించిన సమయంలో ఇక్కడి నుంచే కొబ్బరి కాయలను విదేశాలకు తరలిచేవారు. ఈ ప్రాంతాన్ని ఆ కాలంలో కోకో నాడ అని పిలిచేవారు. దగ్గరలో కోరింగ నదికి ఓడరేవు ఉండడం వల్ల కోరింగ అనే పేరు కూడా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాకినాడగా మారింది.
వాల్తేరు :
ఇప్పుడు వైజాగ్‌గా (విశాఖపట్టణం) పిలిచే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు వాల్తేరు అని పిలిచేవారు. వాల్తేరు అనేది ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ సంస్కృతిక, మానవ హక్కుల పరిరక్షకుడు, సామాజిక విప్లవకారుడి పేరు. ఆయన అప్పట్లో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారట! అందుకే ఆయన పేరు మీదుగానే వైజాగ్‌కు వాల్తేరు అనే పేరు వచ్చిందట!
విక్రమ సింహపురి :
పెన్నా నది పక్కనే ఉండే నెల్లూరు జిల్లాను ఒకప్పుడు విక్రమ సింహపురిగా పిలిచేవారు. ఇప్పుడు నెల్లూరుగా మనం పిలుస్తున్నాం.
భావపురి :
బాపట్ల జిల్లాలో భావ నారాయణస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని భావపురిగా పిలిచేవారు. కాలక్రమంలో భావపురి బాపట్లగా మారింది.
సిక్కోలు (చికాకొల్) :