How To Maintain Healthy Weight:ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా చాలా మంది చిన్న వయసులోనే మధుమేహం, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన బరువు మెయిన్టెయిన్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అసలు, బరువు(Weight) పెరగడానికి కారణాలేంటి? అలాకుండా హెల్తీ వెయిట్ మెయిన్టెయిన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి బరువును వయసు, లింగం, జీవనశైలి, కుటుంబ అలవాట్లు, నిద్ర, నివసించే, పని చేసే ప్రదేశంతో సహా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిపైనే బరువు పెరగడం, తగ్గడం అనేది ప్రధానంగా ఆధారపడి ఉంటుందంటున్నారు. ఏదేమైనప్పటికీ.. సరైన పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ వయసు పెరిగే కొద్ది కూడా మీ శరీరాన్ని వీలైనంత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చంటున్నారు.
ఆరోగ్యకరమైన బరువును ఎలా మెయిన్టెయిన్ చేయాలంటే?
- చురుకుగా ఉండటం, పోషకాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
- అలాగే వారానికి కనీసం 150 నిమిషాలైనా శారీరక శ్రమను లక్ష్యంగా చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. వీటితో పాటు మీ వయసు, లింగం, ఎత్తు, బరువు, శారీరక శ్రమ స్థాయి ఆధారంగా మీకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరమో తెలుసుకోవాలి. దాని ఆధారంగా ఫుడ్ డైట్ మెయిన్టెయిన్ చేయాలని సూచిస్తున్నారు.
- ఒకవేళ మీరు అధిక బరువు ఉంటే తగ్గడానికి, సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ వ్యాయామం చేసేలా చూసుకోవాలి లేదా తక్కువ కేలరీలు తినాలి. అదే.. బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్నట్లయితే తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకుంటూ మీరు తినే కేలరీల సంఖ్యను పెంచుకోవాలంటున్నారు.
బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ఏమి తినాలి?
మీరు బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రయత్నిస్తున్నట్లయితే.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అందులో ప్రధానంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, లీన్ ప్రోటీన్లతో కూడిన ఆహారం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు బరువు తగ్గాలనుకుంటే, పెరగాలనుకుంటే మరికొన్ని విషయాలను మీరు తెలుసుకోవాలి. అవేంటంటే..