Health Benefits of Ganji :చలికాలంలో వాతావరణ మార్పులు జుట్టుపై కూడా ప్రభావం చూపిస్తాయి. పొడిగాలుల కారణంగా తేమ తగ్గి.. జుట్టు నిర్జీవంగా మారుతుంది. అలాగే జుట్టు చిట్లడం, అధికంగా రాలడం, చుండ్రు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీంతో ఎక్కువ మంది మార్కెట్లో లభించే ఖరీదైన షాంపూలు, కండిషనర్లను వాడుతుంటారు. కానీ, ఇంట్లో మనం వృథాగా పారబోసే అన్నం వార్చిన గంజిఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. చైనీస్, కొరియన్ బ్యూటీకేర్‌లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యమూ ఉందని అంటున్నారు. మరి దీన్నెలా వాడాలి? ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టుకు మెరుపు..
గంజిలో ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. అలాగే ఒత్తుగా ఎదిగేలా చేస్తుంది. గంజిలో కాస్త నిమ్మరసం కలిపి కురులకు పెడితే మెరుపూ కనిపిస్తుంది.
పొడవు పెరుగుతుంది..
ఉడికించిన అన్నం నీళ్లల్లో విటమిన్ బి, ఇ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణ అందించి ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తాయి. గంజిని కండిషనర్‌గా వాడితే జుట్టు చిట్లడం తగ్గుతుంది. అలాగే పొడవు కూడా పెరుగుతుంది.
కురులు మెత్తగా :
శీతాకాలంలో చాలా మంది జుట్టుబిరుసుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చగా ఉన్నపుడే గంజిని తలకు పట్టించి ఓ పదిహేను నిమిషాలు వదిలేయండి. తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే కురులు మెత్తగా మారుతాయి. గంజిలోని నేచురల్ ప్రొటీన్... జుట్టుకి సహజంగా నిగారింపుని తెస్తుంది.
గంజితో మరిన్ని లాభాలు :
- సాధారణంగానే వయసు పెరిగే కొద్దీ ఒంట్లో శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. చిన్నపనులకే త్వరగా అలసిపోతుంటాం. మీకు కూడా ఇలానే అనిపిస్తుంటే కాస్త గంజి తాగి చూడండి. గంజి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ని సమన్వయం చేసి.. మనల్ని చురుగ్గా మారుస్తుంది.
- కొందరు ఏం తిన్నా అరిగించుకోలేరు. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే ఓ చిన్న గ్లాసు గోరువెచ్చని గంజి తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
- దీనివల్ల జీర్ణప్రక్రియ వేగం పుంజుకుంటుంది. అలాగే కడుపు నొప్పి, ఇతరత్రా సమస్యలు కూడా తగ్గిపోతాయి.
- ప్రతి ఆడపిల్లకూ పీరియడ్ పెయిన్స్ అనుభవమే. వీటి నుంచి ఉపశమనం కలగాలంటే... ఆ టైమ్‌లో రోజూ ఒక గ్లాసు గంజి తాగి చూడండి. మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఒత్తిడీ, భావోద్వేగాలూ అదుపులో ఉంటాయి.
- అన్నం వార్చిన నీళ్లలో విటమిన్ బి తోపాటు ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులనూ రానీయకుండా అడ్డుకుంటాయి.
- బరువు తగ్గాలనుకునే వాళ్లు గంజి తాగితే త్వరగా మంచి ఫలితం కనిపిస్తుందట. ఇందులో క్యాలరీలు తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దీనిని కొంచెం తీసుకోగానే కడుపు నిండుగా అనిపించి, ఎక్కువగా తినే అలవాటు అదుపులోకి వస్తుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
వాషింగ్ మెషీన్లో బట్టలకు గంజి పెట్టొచ్చని మీకు తెలుసా? - ప్రాసెస్ వెరీ ఈజీ - ఇప్పుడే తెలుసుకోండి!
జనరేషన్ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!