Krishna Janmashtami 2024 Wishes and Quotes :కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి.. పేరు ఏదైనా జగన్నాటక సూత్రధారి అవతరించిన రోజు అంటే ఓ సంబరం, ఓ వేడుక. చిన్న పిల్లలేమో బాలకృష్ణుడి వేషధారణలో కనిపిస్తూ ఇల్లంతా కలియతిరుగుతూ సందడి చేస్తే.. పెద్దవాళ్లేమో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడిని తమ నట్టింట్లోకి ఆహ్వానిస్తుంటారు. కీర్తనలు, కోలాటాలు, ఉట్టికొట్టడాలు, అలంకరణలు, నైవేద్యాలు.. చెప్పుకుంటూ పోతే కృష్ణాష్టమి వేడుక గురించి మాటలు చాలవు.
అంతటి విశిష్టమైనజన్మాష్టమి(Janmashtami 2024)పర్వదినానికి ఘడియలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు శ్రీ కృష్ణుని భక్తులు రెడీ అవుతున్నారు. మరి, మీరూ వేడుకలకు సిద్ధంగా ఉన్నారా? అలాగే కృష్ణాష్టమిని పురస్కరించుకొని మీకు ఇష్టమైన వారికి, ఫ్రెండ్స్, బంధువులకి ప్రత్యేకంగా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అయితే, ఈ శుభవేళ.. మీ కోసం "ఈటీవీ భారత్" కొన్ని స్పెషల్ విషెస్, కోట్స్ తీసుకొచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి.
Janmashtami 2024 Wishes in Telugu :
- "కన్నయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని మీ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరియాలని.. ఆ కృష్ణభగవానుడు మీకు ఆయుఃరారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ.. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు."
- "నల్లటి మేఘంలోంచి సూర్యుడు బయటకు వచ్చినట్టు.. అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం వెలుగుచూస్తుంది. అది శ్రీకృష్మ పరమాత్మ ప్రార్థనతోనే సాధ్యం."- అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు.
- " శ్రీ కృష్ణభగవానుడు ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలతో.. మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ.. హ్యాపీ కృష్ణాష్టమి"
- "మీ కష్టాలు తొలగిపోవాలి. ఆనందం వెల్లివిరియాలి. ఆ నందగోపాలుడి దీవెనలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. మీకూ, మీ కుటుంబ సభ్యులకు జన్మాష్టమి శుభాకాంక్షలు."
- "కృష్ణాష్టమి అంటేనే.. ఆనందం, సంతోషం, ప్రేమమయం. అందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు."
- "భగవంతుడిగా కాదు గురువుగా.. మిమ్మల్ని వెలుగు వైపు నడిపించాలి. శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!"
- "వెన్నదొంగ మీ కష్టాలను దొంగిలించాలని.. మిమ్మల్ని తియ్యటి వెన్నతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ కృష్ణాష్టమి!!"
- "చెడును అంతం చేసేందుకు శ్రీకృష్ణుడు అవతరించారు. గోకులాష్టమి నాడు చెడు తొలగిపోయి.. మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తూ జన్మాష్టమి శుభాకాంక్షలు!"
పట్టిందల్లా బంగారం కావాలా? - "కృష్ణాష్టమి" రోజు కన్నయ్యను ఈ పూలతో పూజించండి!
Krishna Janmashtami 2024 Quotes in Telugu :
''ప్రతి మనిషికి చావు, పుట్టుక తప్పదు.
వివేకవంతులు వీటి గురించి ఆలోచించరు."
- అందరికీ హ్యాపీ జన్మాష్టమి!!
''నీకు నువ్వే ఆప్తుడివి.. నీకు నువ్వే శత్రువువి..
నీకు నువ్వే ఇచ్చుకుంటే.. నీకు నువ్వే అధిపతివి..
నీ ఆలోచనే నిన్ను నడిపిస్తుంది."
- అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు!