తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చలికాలంలో జలుబు, దగ్గును పోగొట్టే "జింజర్​ గార్లిక్​ సూప్​" - వేడివేడిగా ఎంతో హాయిగా ఉంటుంది! - HOW TO MAKE GINGER GARLIC SOUP

-అల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో -ఇలా సూప్​ ప్రిపేర్​ చేసుకుంటే అద్దిరిపోతుంది

How to Make Ginger Garlic Soup in Telugu
How to Make Ginger Garlic Soup in Telugu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 6:57 PM IST

How to Make Ginger Garlic Soup in Telugu:చలికాలంలో వేడి వేడి సూప్స్​కు ఉండే డిమాండ్​ అంతా ఇంతా కాదు. మార్కెట్​ నుంచి ఇన్​స్టంట్​ సూప్​ ప్యాకెట్ తీసుకొచ్చి మరీ ప్రిపేర్​ చేసుకుంటారు. మరికొంతమంది మాత్రం రెడిమేడ్​ రుచులు నచ్చక.. ఇంట్లోనే టేస్టీగా, హెల్దీగా తయారు చేసుకుంటుంటారు. ఇక సూప్స్​ అంటే చాలా మందికి టమాట, క్యారెట్​, బీట్​రూట్​, వెజిటేబుల్​ సూప్​ వంటివి మాత్రమే ప్రిపేర్​ చేస్తుంటారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా మరెన్నో రకాల సూప్స్ ఉన్నాయి. అందులో జింజర్​, గార్లిక్​ సూప్​ కూడా ఒకటి. ఈ చలికాలంలో ఈ సూప్​ను వేడివేడిగా తాగడం వల్ల చలి నుంచి ఉపశమనం మాత్రమే కాదు.. దగ్గు, జలుబు వంటి సీజనల్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరి ఈ హెల్దీ సూప్​ను ప్రిపేర్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • అల్లం - ఇంచ్​
  • నెయ్యి - అర టీ స్పూన్​
  • క్యారెట్​ - కొద్దిగా
  • వాటర్​ - ఒకటిన్నర గ్లాసు
  • మిరియాలు - అర టీ స్పూన్​
  • కార్న్​ఫ్లోర్​ - 1 టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా వెల్లుల్లి, అల్లం పొట్టు తీసి పక్కన పెట్టాలి. అనంతరం వీటిని రోట్లో వేసి మెత్తగా దంచుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే రోట్లో మిరియాలు వేసి కచ్చాపచ్చాగా దంచి మరో గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే క్యారెట్​ను శుభ్రంగా సన్నగా కట్​ చేసి పక్కన పెట్టాలి.
  • మరో గిన్నెలో కార్న్​ఫ్లోర్​, నీళ్లు పోసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్​ను సిమ్​లో పెట్టి దంచిన అల్లం, వెల్లుల్లి పేస్ట్​ వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్​ చేసిన క్యారెట్​ ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • అల్లం వెల్లుల్లి తురుము, క్యారెట్​ ముక్కలు వేగిన తర్వాత నీళ్లు పోసి కలిపి ఓ 5 నిమిషాలు మరిగించాలి.
  • నీరు మరుగుతున్నప్పుడు దంచిన మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
  • ఆ తర్వాత ముందే కలిపి పెట్టుకున్న కార్న్​ఫ్లోర్​ మిశ్రమాన్ని వేసి మరో 5 నిమిషాలు మరిగించుకుని కొత్తిమీర తరుగు చల్లి స్టవ్​ ఆఫ్​ చేసి సర్వ్​ చేసుకుంటే చాలు. అంతే ఎంతో టేస్టీగా ఉండి, ఆరోగ్యానికి మేలు చేసే జింజర్​ గార్లిక్​ సూప్​ రెడీ.
  • నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. జలుబు, దగ్గు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details