తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఈ చలికాలంలో గీజర్​ కొనాలనుకుంటున్నారా? - ఇవి తెలియకపోతే ముప్పు! - GEYSER BUYING TIPS IN TELUGU

- గీజర్​ కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Geyser Buying Tips in Telugu
Geyser Buying Tips in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 3:27 PM IST

Geyser Buying Tips in Telugu : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఇక చలికాలం వచ్చిందంటే చన్నీటితో స్నానం కష్టమే. అందుకే చాలా మంది ఇళ్లల్లో వాటర్​ హీటర్లు, గీజర్లు వాడుతుంటారు. ఈ కాలంలో వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతుంటాయి. అయితే.. వేడి నీటి కోసం గీజర్ కొనే వారుముందుగా కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక విషయంలో పొరపాటు చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. మరి, గీజర్ కొనే ముందు పరిశీలించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సరైన కెపాసిటీ: చాలా మంది గీజర్లు కొనేముందు కెపాసిటీ చెక్​ చేయరు. దీంతో అవసరానికి తక్కువ లేదా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ ఎంత వేడినీరు అవసరం అవుతుందో ముందుగానే లెక్క వేసుకుని.. అందుకు తగ్గట్టు కెపాసిటీ ఉన్న గీజర్ ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు..? ఎంత వాడే అవకాశం ఉంది? అనే వివరాలు తెలుసుకుని ఓ అంచనాకు వచ్చి దానికి తగినట్లుగా తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణ కుటుంబానికి 10 నుంచి 25 లీటర్ల మధ్య కెపాసిటీ ఉండే గీజర్ సరిపోతుందని.. ఒకరో.. ఇద్దరో ఉంటే అంత కంటే తక్కువ తీసుకోవచ్చంటున్నారు.

ఎనర్జీ రేటింగ్: గీజర్ తీసుకునే సమయంలో ఎనర్జీ రేటింగ్ తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ రేటింగ్ తక్కువగా ఉంటే విద్యుత్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే 5 స్టార్ లేకపోతే 4 స్టార్ బీఈఈ(BEE) ఎనర్జీ రేటింగ్ ఉన్న గీజర్లు కొనడం ఉత్తమమంటున్నారు. 4 కంటే తక్కువ రేటింగ్ ఉండే కాస్త ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఏదో ఒకటని హడావిడి పడకుండా కాస్త రేటింగ్​ను చూసి కొనాలని సలహా ఇస్తున్నారు.

సేఫ్టీ ఫీచర్స్: చాలా మంది గీజర్ కొనే సమయంలో సేఫ్టీ ఫీచర్లను పెద్దగా పట్టించుకోరు. అయితే.. గీజర్ వాడే సమయంలో ఎలాంటి ప్రమాదమూ జరగుకుండా ఉండాలంటే.. సేఫ్టీ ఫీచర్లు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్​ అంటున్నారు నిపుణులు. ఓవర్ హీటింగ్ అవకుండా థెర్మోస్టార్ట్ ఫీచర్ ఉండాలని.. ప్రెజర్ రిలీఫ్​ వాల్వ్స్, థర్మల్ కట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటే మేలంటున్నారు. కొనేముందు ఈ ఫీచర్ల గురించి బాగా పరిశీలించాలి.

సరైన టైప్: గీజర్లలో స్టోరేజ్, ఇన్‍స్టంట్ అంటూ రెండు టైప్స్ ఉంటాయి. వీటి గురించి తెలియకుండా తీసుకుంటే వాడడం కష్టమవుతుంది. కుటుంబంలో ఎక్కువ మంది.. ఎక్కువ వేడి నీటిని వాడాలనుకుంటే స్టోరేజ్ గీజర్లను తీసుకోవాలని.. ఒకవేళ వాడకం తక్కువగా ఉంటే ఇన్‍స్టంట్ గీజర్ తీసుకోవచ్చంటున్నారు.

ఫర్నీచర్‌ కొనాలనుకుంటున్నారా..? ఈ రెండింటిలో ఏది బెటరో తెలుసుకోండి!

గీజర్ కొనడానికి ప్లాన్​ చేస్తున్నారా? - అయితే ఈ బెస్ట్ మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details