Omega-3 Fatty Acids in Fish : బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ రేట్లు పతనం కాగా, చేపల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నదులు, సముద్ర తీర ప్రాంతాల్లో ధరల్లో పెద్దగా తేడా లేనప్పటికీ పట్టణాలు, నగరాల్లో చేపల వ్యాపారులు ధరలను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. ఈ ధరల విషయం పక్కనబెడితే అసలు చేపల్లో ఏ రకం మంచివో తెలియక జనం తల పట్టుకుంటున్నారు. మంచి నీటి చేపలు బెటరా? ఉప్పు నీటి చేపలు మంచివా? అనే సందిగ్ధంలో ఉన్నారు. నదుల్లో దొరికే చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయా లేక సముద్ర చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయా అనే విషయం ఇవాళ తెలుసుకుందాం.
నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడేది చేపలే! మాంసాహారంలో చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్, మటన్ నెలలో రెండు, మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. కానీ, చేపలు అంతకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనట.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి
చేపల్లో అనేక రకాలు ఉంటాయి. కొంత మంది వాటిని నల్ల చేపలు, తెల్ల చేపలుగా వర్గీకరిస్తుంటారు. ఇంకొందరు రవ్వ, బొచ్చ, కొర్రమీను అంటూ చేపల్లో రకాల గురించి చెప్తుంటారు. చేపల వేపుడు, చేపల కూర, చేపల సూప్ ఉన్నట్లే చేపల్లోనూ రకాలున్నాయి. నది చేపలు, చెరువు చేపలు, సముద్ర చేపలు, బురద గుంటల్లో చేపలు ఇలా ఎన్నో రకాలున్నాయి. వాటన్నింటినీ ప్రధానంగా నది చేపలు, సముద్రపు చేపలుగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మంచి నీటి చేపలతో పోలిస్తే ఉప్పు నీటి చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
చేపల్లో లభించే ముఖ్యమైన పోషకాలు:
- చేపల్లో లభించే అధిక నాణ్యమైన ప్రొటీన్ కండరాల నిర్మాణం, మరమ్మతుకు సహకరిస్తుంది.
- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో అధికంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
- చేపల్లో విటమిన్ డి, విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి12 సహా కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. సెలీనియం, నియాసిన్, టౌరిన్ లాంటి ముఖ్యమైన పోషకాలను చేపల ద్వారా లభిస్తాయి.
- చేపల్లో లభించే మంచి కొవ్వులు ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.