తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

గోధుమపిండితో ఇలా చేశారంటే - మీ ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదట! - BEST TIPS TO GET RID OF RATS

మీ ఇంట్లో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందా? - ఇలా చేశారంటే ఒక్కటి కూడా ఉండదట!

Best Tips to Get Rid of Rats
HOW TO GET RID OF RATS IN HOUSE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 7:56 PM IST

Best Tips to Get Rid of Rats :చాలా మంది ఇళ్లలో ఎలుకల సమస్య కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే వాటిని ఇంటి నుంచి తరిమికొట్టేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. బోన్లు పెట్టడం, ఎర వేయడం, గమ్​ స్టిక్స్​ పెట్టడం, మందులు పెట్టడం.. ఇలా ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. అయినా, కొన్నిసార్లు ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ ఇంట్లోనూ ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? అయితే, ఓసారి ఈ నేచురల్ టిప్స్ ట్రై చేసి చూడండి. దెబ్బకు ఇంట్లో ఒక్క ఎలుక లేకుండా పారిపోతాయంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గోధుమ పిండితో..

ఎలుకల సమస్య నుంచి బయటపడేందుకు ఇకపై మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా తరిమికొట్టే ఒక సూపర్ టిప్ తీసుకొచ్చాం. అందుకోసం మీరు చేయాల్సిందల్లా ముందుగా ఒక బౌల్​లో కొద్దిగా గోధమ పిండిని తీసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆపై కొన్ని బిర్యానీ ఆకులు, టీ ఆకులను తీసుకొని వేరువేరుగా మెత్తని పొడిలా చేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి.

ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆపై ఒక్కో ముద్ద మధ్యలో కొద్దికొద్దిగా బిర్యానీ ఆకులు, టీ ఆకుల పొడి, బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ వేసుకొని మళ్లీ ఉండ మాదిరిగా చేసుకోవాలి. అలా అన్నింటినీ చేసుకొని ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో ఉంచాలి. అప్పుడు ఆ పిండి ముద్దను తిన్న ఎలుకలు ఇంట్లో నుంచి ఒక్కటి లేకుండా పారిపోతాయంటున్నారు నిపుణులు.

ఇలా చేసినా గుడ్ రిజల్ట్..

ఈ టిప్ కూడా ఎలుకలను ఇంటి నుంచి తరిమికొట్టడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం గోధుమపిండిని కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆపై ఒక బౌల్​లో కొద్దిగా పొగాకు పొడి, కారం, నెయ్యి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఒక్కో గోధుమ పిండి ఉండను తీసుకొని దాని మధ్యలో కొద్దిగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఉంచి మరలా బాల్ మాదిరిగా చేసుకోవాలి. తర్వాత వాటిని ఎలుకలు తిరిగే చోట ఉంచాలి. అప్పుడు అవి తిన్న ఎలుకలు ఇంటి నుంచి పరార్ అవుతాయంటున్నారు.

అదేవిధంగా, గోధుమ పిండి ఉండల్లో ఘాటైన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించినా మరింత బెటర్ రిజల్ట్స్ చూస్తారంటున్నారు. ఇందుకోసం పొగాకు, వెల్లుల్లి, మిరియాలు, బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి లేదా యూకలిప్టస్ ఆయిల్​ను యూజ్ చేయవచ్చంటున్నారు. వీటిని ఉపయోగించి పైన చెప్పిన విధంగానే పిండి ముద్దలుగా చేసి ఎలుకలు తిరిగే చోట ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుందంటున్నారు నిపుణులు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

  • మీరు గోధుమ పిండి ముద్దలను ఉపయోగించి ఎలుకలను ఇంట్లో లేకుండా చేయాలనుకున్నప్పుడు పెంపుడు జంతువులను వాటికి దూరంగా ఉండేలా చూసుకోవాలి.
  • అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ పిండి ఉండలను గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవి డ్రై మారితే వాటిని పారేసి కొత్తవి పెట్టాలి. ఎలుకలు పొడి పిండి బంతుల దగ్గరకు రావనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

హడలెత్తిస్తోన్న డెంగీ - కాయిల్స్,​ రిపెల్లెంట్స్​తో​ పని లేకుండా ఈ టిప్స్​ పాటిస్తే - దోమలు రమ్మన్నారావు!

కిచెన్​లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా ? - ఈ టిప్స్​తో శాశ్వతంగా పారిపోతాయి!!

ABOUT THE AUTHOR

...view details