తెలంగాణ

telangana

మీ ఇంట్లో బొద్దింకలు ఇబ్బందిపెడుతున్నాయా? - ఇలా చేశారంటే దెబ్బకు ఇంటి నుంచి పరార్! - How to Get Rid of Cockroaches

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 12:03 PM IST

How to Get Rid of Cockroaches: మీ ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? వాటిని తరిమికొట్టడానికి ఎన్ని రకాల స్ప్రేలు ఉపయోగించినా ఫలితం లేదా? అయితే.. ఓసారి ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. బొద్దింకలను ఈజీగా ఇంటి నుంచి తరిమికొట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Easy Tips to Avoid Cockroaches
How to Get Rid of Cockroaches (ETV Bharat)

Easy Tips to Avoid Cockroaches at Home: ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా.. ఎక్కడ దాక్కుంటాయో తెలియదు కానీ రాత్రి అయ్యేసరికి వంటగదిలో దండయాత్ర చేస్తాయి బొద్దింకలు. వీటితో నేరుగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. ఇవి హానికారక సూక్ష్మజీవులను తరలించే వాహకాలుగా పనిచేస్తాయి. బొద్దింకల సంఖ్య ఎక్కువై ఇంట్లో తిరుగుతుంటే చిరాకుగా ఉంటుంది. పొరపాటున మనం తినే ఆహారంలోకి చొరబడితే దానిని తినలేం. అలాగే.. ఒకవేళ మనకు తెలియకుండా తింటే రోగాల బారినపడటం పక్కా! అందుకే.. చాలా మంది వీటిని చంపడానికి స్ప్రేలు వాడుతుంటారు. కానీ.. ఈ స్ప్రేలలో ఉండే కెమికల్స్ వల్ల మనకు పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే.. బొద్దింకలను తరిమికొట్టడానికి కొన్ని నేచురల్ చిప్స్ సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీటిని క్లీన్​గా ఉంచుకోవాలి : బొద్దింకలు ఎక్కువగా వాడని, తేమ అధికంగా ఉండే ప్రదేశాల్లో తిష్ట వేస్తుంటాయి. కాబట్టి.. కప్‌బోర్డులు, కిచెన్ సింక్ ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి. అలాగే.. ఇంట్లో ఎక్కడైనా హోల్స్, క్రాక్స్, పగిలిన పైప్స్ ఉంటే ముందుగా వాటిని క్లోజ్ చేయాలి. దీని వల్ల అక్కడ నివాసాలు ఏర్పరుచుకోకుండా ఉంటాయంటున్నారు నిపుణులు.

వేప: ఇంటి నుంచి బొద్దింకలు, ఇతర క్రిములను నిర్మూలించడానికి వేపాకులు ప్రభావంతంగా పనిచేస్తాయి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో వేపాకులు ఉంచండి. రోజూ ఈ ఆకులను మారుస్తూ ఉండండి. మూడు రోజుల్లో మీరు రిజల్ట్స్ను చూడొచ్చు. లేకుంటే రాత్రి పడుకునే ముందు బొద్దింకలు సంచరించే ప్రదేశాల్లో వేప పొడి లేదా వేపనూనెను రాసుకోవాలి. బొద్దింకల గుడ్లను చంపడానికి.. వేపనూనెలో కొంచెం వేడి నీళ్లు వేసి స్ప్రే చేయండి.

వైట్ వెనిగర్ :బొద్దింకలను తరిమికొట్టడంలో వైట్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిలో సమాన పరిమాణంలో వాటర్, వైట్ వెనిగర్​ని తీసుకొని కలపాలి. ఆపై ఆ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట స్ప్రే చేయాలి.

బేకింగ్ సోడా : ఇదీ బొద్దింకల నివారణకు చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న బౌల్​లో సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, పంచదార తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని బొద్దింకల సమస్య ఉన్న చోట చల్లండి. ఇందులోని చక్కెర బొద్దింకలను అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు చనిపోతాయంటున్నారు నిపుణులు.

లవంగం :బొద్దింకలను వదిలించుకోవడానికి లవంగం బెస్ట్ హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. దీనికి ఎలాంటి అదనపు శ్రమ అవసరం లేదు. అవి సంచరించే ప్రదేశంలో లవంగాలను పెడితే సరిపోతుందంటున్నారు.

బే ఆకు/బిర్యాని ఆకు :బే ఆకులను పొడిగా చేసినా లేదా విడిగా ఆకులనైనా వేడి నీటిలో ఉడకించండి. ఆపై దాన్ని స్ప్రే బాటిల్​లో పోసుకొని బొద్దింకలు సంచరించే చోట స్ప్రే చేయండి. ఆ వాసనను బొద్దింకలు ఇష్టపడవు. కాబట్టి అవి ఇల్లు వదిలి వెళ్లిపోతాయంటున్నారు నిపుణులు.

అలాగే.. ఎండుమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిని కలిపి పేస్ట్‌లాగా రెడీ చేయండి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉండే చోట పెట్టడం వల్ల అవి పారిపోతాయి. లేదంటే.. బొద్దింకలు ఎక్కువగా ఉన్న చోట హెయిర్‌ స్ప్రేను కొట్టడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటన్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

మీ ఇంట్లో చీమల కుప్పలు చిరాకు పెడుతున్నాయా? - ఇలా చేశారంటే మళ్లీ అటువైపు కన్నెత్తి చూడవు!

వర్షాకాలంలో దోమలకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వద్దు - ఇలా చేస్తే ఒక్క దోమ కూడా కుట్టదు!

ABOUT THE AUTHOR

...view details