తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

దీపావళి స్పెషల్ : నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పెసరపప్పు హల్వా" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

ఎప్పుడూ రొటిన్ స్వీట్ రెసిపీలే కాదు - దీపావళికి కాస్త డిఫరెంట్​గా ఈ హల్వాను ట్రై చేయండి!

Moong Dal Halwa Recipe
Moong Dal Halwa (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

How to Make Moong Dal Halwa in Telugu : దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది టపాసులు, మిఠాయిలే. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో రకరకాల స్వీట్ రెసిపీలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అలాంటి వారికోసం ఈ పండగ(Diwali 2024) వేళ ఒక కొత్త స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే "పెసరపప్పు హల్వా". ఇది చాలా రుచికరంగా ఉండి తింటుంటే తినాలనిపిస్తుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ! ఇంతకీ.. ఈ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెసరపప్పు - 1 కప్పు(200 గ్రాములు)
  • నెయ్యి - 1 కప్పు
  • జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు
  • కిస్​మిస్ - 1 టేబుల్ స్పూన్
  • బొంబాయి రవ్వ - 1 టేబుల్ స్పూన్
  • బాదం పలుకులు - కొన్ని(కట్ చేసుకున్నవి)

షుగర్ సిరప్ కోసం :

  • చక్కెర - 1 కప్పు(200 గ్రాములు)
  • వాటర్ - అర కప్పు
  • కుంకుమ పువ్వు - చిటికెడు
  • యాలకుల పొడి - అర టీస్పూన్

నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్​" - ఇలా చేస్తే అచ్చం స్వీట్​ షాప్​ టేస్ట్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 3 నుంచి 4 గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం పప్పులోని నీళ్లను వడకట్టి మిక్సీ జార్​లోకి తీసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని చక్కెర, వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగే వరకు మరిగించుకోవాలి.
  • చక్కెర పూర్తిగా కరిగాక.. అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసుకొని కలుపుతూ 1 నుంచి 2 నిమిషాల పాటు మరిగించుకున్నాక పాన్​ని దింపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మరో పాన్ పెట్టుకొని అర కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి బాగా వేడయ్యాక జీడిపప్పు పలుకులు, కిస్​మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో బొంబాయి రవ్వ వేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • అది వేగిన తర్వాత స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పెసపప్పు పేస్ట్​ని వేసుకొని ఉండలు కట్టకుండా గరిటెతో కదుపుతూ బాగా వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకునేటప్పుడే మిగిలిన అరకప్పు నెయ్యిని కూడా కొద్దికొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మిశ్రమం నుంచి నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందుకోసం 12 నుంచి 15 నిమిషాల వరకు టైమ్ పట్టొచ్చు.
  • అలా వేయించుకున్నాక.. అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ యాడ్ చేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్​ మీద మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇక చివరగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు, కిస్​మిస్​తో పాటు కట్ చేసుకున్న బాదం పలుకులు వేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "పెసరపప్పు హల్వా" రెడీ!

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details