ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

'ఒక్క నిమ్మకాయ చాలు' - ఈ విషయం తెలియక గృహిణులు ఎంత కష్టపడుతున్నారో! - HOW TO CLEANING REFRIGERATOR

నిమ్మకాయతో రిఫ్రిజిరేటర్ సేఫ్ - తరచూ క్లీన్ చేయాల్సిన అవసరం లేదంట

benefits_of_keeping_lemon_slices_in_the_fridge
benefits_of_keeping_lemon_slices_in_the_fridge (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 18 hours ago

Benefits of keeping lemon slices in the fridge :నిమ్మకాయ ఉపయోగాలు మనవాళ్లకు చాలా తెలుసు. పూజలతో పాటు, పులిహోర తదితర వంటల్లో ఎక్కువగా ఉపయోగించే నిమ్మకాయలు కొన్నిసార్లు అందం కోసం వాడుతుంటారు. అయితే నిమ్మకాయల వల్ల మరో అద్భుత ప్రయోజనం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఎంతో మంది గృహిణులు ఎదుర్కొంటున్న ఓ సమస్య ఒక్క నిమ్మకాయ వల్ల పరిష్కారం అవుతుంది. ఇది నిజం ఈ కథనం చదివిన వారంతా వావ్ అనకుండా ఉండలేరు.

అల్లం వెల్లుల్లి పేస్ట్​ త్వరగా పాడవుతోందా? - ఇలా స్టోర్​ చేస్తే నెలల పాటు తాజాగా!

నిమ్మకాయలను కట్ చేసి ఆ ముక్కలతో ఏవైనా వస్తువులను శుభ్రపరచవచ్చు. అంతే కాకుండా వంటల్లో ఉప్పు, కారం ఎక్కువైనపుడు నిమ్మకాయ రసం పిండి ఆ ప్రభావం లేకుండా చూస్తుంటారు. నిమ్మకాయలను ఎక్కువ మంది ఫ్రిజ్​లో నిల్వ ఉంచుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్​లో ఉంచినా దుర్వాసన వస్తుంటాయి. త్వరగా పాడైపోతుంటాయి. అలాంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే నిమ్మకాయలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు ఉపయోగపడతాయి. నిమ్మకాయ నుంచి వచ్చే పరిమళ భరితమై వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ ఇప్పటి వరకు తెలిసిన ప్రయోజనాలే. కానీ, మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే నిమ్మకాయని కట్ చేసి ముక్కలు ఫ్రిజ్​లో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

ఫ్రిడ్జ్ ఎంత శుభ్రంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఆహార పదార్థాలన్నీ నిల్వ ఉంచేది ఫ్రిజ్​లో కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. అయితే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు చెడిపోకుండా, ఫ్రిజ్ దుర్వాసన రాకుండా మంచి వాసనతో వెదజల్లాలంటే నిమ్మకాయ ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిజ్ పరిశుభ్రంగా ఉండడంతో పాటు తరచూ శుభ్రం చేయాల్సిన పరిస్థితి రాదు. పైగా ఆహార పదార్ధాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి.

నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు (Antibacterial properties) ఫ్రిజ్​లో ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్​లో ఉంచడం వల్ల బ్యాక్టీరియాలను చంపేస్తుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఉండడంతోపాటు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, ఫ్రిజ్​లో ఉండ గాలిని కూడా సహజంగా శుభ్రంగా ఉంచటంలో నిమ్మకాయ ముఖ్యపాత్ర వహిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే నిమ్మకాయని కట్ చేయకుండా ముక్కలుగా కోసి పెడితే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు.

ఫ్రిడ్జ్ లో దుర్వాసన రాదు

మనం ఫ్రిడ్జ్ ని ఎంత శుభ్రంగా ఉంచుతున్నా ఒక్కోసారి దుర్వాసన వస్తుంటుంది. ఆహార పదార్థాలు చెడిపోవడమే అందుకు కారణం. అందుకే ఒక్కో నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి పెట్టి ఫలితాన్ని చూడండి.

ఫ్రిడ్జ్​లో ఫుడ్​ ఐటమ్స్​ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేయకండి! - లేదంటే త్వరగా పాడైపోతాయి!

ఫ్రిడ్జ్‌ డోర్‌ ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తోందా ? ఈ టిప్స్​ పాటిస్తే క్లీన్​ అండ్​ ఫ్రెష్​ పక్కా! - Tips for Cleaning Refrigerator

ABOUT THE AUTHOR

...view details