తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వహ్వా అనిపించే "క్రిస్పీ పొటాటో క్యూబ్స్" - చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - Crispy Potato Cubes - CRISPY POTATO CUBES

Crispy Potato Cubes Recipe : ఆలూతో ఎన్ని వెరైటీలు చేసినా.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి వారికోసం నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే.. సూపర్ టేస్టీ స్నాక్ ఐటమ్ తీసుకొచ్చాం. అదే.. క్రిస్పీ పొటాటో క్యూబ్స్. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Crispy Potato Cubes
Crispy Potato Cubes Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 19, 2024, 10:09 AM IST

How to Make Crispy Potato Cubes : చాలా మందికి బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఫేవరేట్ డిష్​గా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకైతే వీటితో చేసిన ఏ ఆహారం అయినా ఇట్టే నచ్చుతుంది. అందుకే.. వారికోసం ఆలూతో ప్రిపేర్ చేసుకునే ఒక స్పెషల్ స్నాక్ ఐటమ్ తీసుకొచ్చాం. అదే.. "క్రిస్పీ పొటాటో క్యూబ్స్". ఎప్పుడూ ఆలూతో చిప్స్​, బజ్జీలు, వడలు, ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా.. ఈసారి ఇలా క్యూబ్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. ఇష్టంగా లాగిస్తారు. పైగా ఈ స్నాక్ రెసిపీ కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. చాలా ఈజీగా నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ.. క్రిస్పీ పొటాటో క్యూబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళ దుంపలు - 4
  • నూనె - వేయించడానికి తగినంత
  • ఉప్పు - కొద్దిగా
  • కాశ్మీరీ చిల్లీ పౌడర్ - 1 టీస్పూన్
  • చాట్ మసాలా - అర టీస్పూన్

తయారీ విధానం :

  • ముందుగా చాకు లేదా పీలర్ సహాయంతో బంగాళదుంపల పైపొట్టు తీసుకోవాలి. ఆపై వాటిని శుభ్రంగా కడిగి చిన్న సైజ్ క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి.
  • తర్వాత ఒక బౌల్​లో కూల్ వాటర్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆలూ క్యూబ్స్ వేసి మరోసారి వాష్ చేసుకోవాలి. ఇది వాటిల్లో ఉన్న ఎక్స్​ట్రా స్టార్చ్ తొలగించడానికి సహాయపడుతుంది.
  • ఆపై వాటిని వాటర్ నుంచి వేరుచేసి ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు మరో బౌల్​లో వేడి వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి.
  • అనంతరం వాష్ చేసి ప్లేట్​లో ఉంచుకున్న ఆలూ ముక్కలను ఉప్పు వాటర్​లో వేసి 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • 5 నిమిషాలయ్యాక జల్లీ సహాయంతో ఆలూ ముక్కలను వడకట్టుకొని.. టిష్యూ పేపర్ లేదా క్లాత్​పై వేసి ఆరబెట్టుకోవాలి. ఇది వాటిల్లో ఉన్న అదనపు వాటర్ పోవడానికి తోడ్పడుతుంది.
  • ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక బంగాళదుంప ముక్కలను అందులో వేసుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి.. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఆలూ ముక్కలు గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు ఒక చిన్న బౌల్​లో అరటీస్పూన్ ఉప్పు, చాట్ మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం.. ఆ మసాలా మిశ్రమాన్ని వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆలూ ముక్కలలో వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "క్రిస్పీ ఆలూ క్యూబ్స్" రెడీ!
  • ఇక వీటిని టూత్​పిక్స్​ సహాయంతో టమాటా సాస్​లో అద్దుకుని తింటే రుచి సూపర్​గా ఉంటాయి!

ABOUT THE AUTHOR

...view details