తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూర్య బ్రోకు నిద్రే రాదు! - ఈ భూమ్మీద చీకటి పడని దేశాలు ఇవే! - COUNTRIES WHERE THE SUN NEVER SETS

- అక్కడ 24 గంటలూ భానుడు వెలుగుతూనే ఉంటాడు!

Countries where the sun never sets
Countries where the sun never sets (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 4:33 PM IST

NEVER SUN SET COUNTRIES : భూమ్మీద సూర్యుడికి ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో వెలుగు కనిపిస్తుంది. అవతలి వైపు ఉన్న ప్రాంతాల్లో చీకటి కనిపిస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ, సూర్యుడు 24 గంటలూ వెలిగే ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. రోజంతా పగటి పూటమాదిరిగానే ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్లి వస్తే భలేగా ఉంటుంది కదా! మరి, ఆ ప్రాంతాలేవో తెలుసుకోండి.

హమ్మర్‌ఫెస్ట్‌ :

నార్వే దేశంలో హమ్మర్‌ఫెస్ట్‌ అనే నగరం ఉంది. ఇక్కడ సూర్యుడు 24 గంటలూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఒక 40 నిమిషాలు మాత్రమే రెస్ట్ తీసుకుంటాడు. రాత్రి 12.43 గంటలకు మేఘాల చాటుకు అలా వెళ్లి, ఇలా వచ్చేస్తాడు. ఈ దేశంలోనే మరో ప్రాంతం "స్వాల్‌బార్డ్‌"లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు రాత్రివేళ కూడా వెలుగుతూనే ఉంటాడు.

ఐస్‌లాండ్‌ :

ఐస్‌లాండ్‌లో జనాలు నివాసం ఉండే ప్రాంతాలు తక్కువే. అయినా, పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కారణం నిద్రపోని సూర్యూడే! జూన్‌ నెలలో ఇక్కడ సూర్యుడు అస్తమించడు. రాత్రివేళ కూడా పగటి పూటలాగనే ఉంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐస్​లాండ్‌లో దోమలు ఉండవు. ఈ వింతలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఐస్ లాండ్​ వెళ్తుంటారు.

యుకొన్‌ :

కెనడాలోని యుకొన్‌ నగరంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వేసవిలో తప్ప, మిగిలిన అన్ని సమయాల్లోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. ఎండా కాలంలో మాత్రం సూర్యుడు మంటలు మండిస్తాడు. సుమారు 50 రోజులపాటు అసలు చీకటి అన్నదే లేకుండా సూర్యకాంతి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని "అర్ధరాత్రి సూర్యుడు ఉండే ప్రాంతం" అని పిలుస్తారు. ఆ సమయంలో అక్కడ పుష్పించే పూలు, వలస పక్షుల కిలకిలతో యుకొవ్‌ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది.

కానాక్‌ :

ఈ ప్రాంతం గ్రీన్‌లాండ్‌లో ఉంటుంది. ఇక్కడ నివసించే మనుషులు కేవలం 650 మందే. వింటర్​లో ఈ ప్రాంతం మొత్తం చీకటిమయం అవుతుంది. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య మాత్రం సూర్యుడి టైమ్ నడుస్తుంది. రాత్రివేళ కూడా సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. చీకటి కాలం ముగిసిన తర్వాత కంటిన్యూగా ఉండే సూర్య కాంతి జనాన్ని కాస్త ఇబ్బంది పెడుతుందడ. అప్పటి వరకూ చీకట్లో ఉన్నవారికి, సూర్యుడి వెలుతురు కారణంగా నిద్రపట్టదట. ఈ తీవ్రతను తగ్గించుకునేందుకు తలుపులు, కిటికీలకు నల్లని పరదాలు కట్టుకుంటారు. సాయంత్రం సమయంలో మాత్రం అక్కడి నేచర్​ ఎంతో మనోహరంగా ఉంటుంది.

కిరునా :

ఇది స్వీడెన్‌లోని ఒక నగరం. సంవత్సరంలో దాదాపు 100 రోజులపాటు పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ప్రతిఏటా మే నెల నుంచి ఆగస్టు మధ్య సూర్యుడు అస్తమించడు. ఈ టైమ్​లో కిరునా అందాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. వీటిని చూడటానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాలిపోతుంటారు. ఇక్కడి చర్చి నిర్మాణం అబ్బురపరుస్తుంది. ప్రత్యేకంగా ఆ చర్చిని చూడడానికి వచ్చేవాళ్లు కూడా ఉంటారు.

ఇంకా :

ఫిన్లాండ్ దేశంలోని లాప్లాండ్ (Lapland) ప్రాంతంలో, రష్యాలోని ఆర్కిటిక్ సర్కిల్ లోపల ఉన్న ఉత్తర ప్రాంతాలు, ముఖ్యంగా ముర్మాన్స్క్ (Murmansk)లో సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details