తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

లఖ్​నవూ స్పెషల్​ "మలై గుత్తొంకాయ కుర్మా" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే జిందగీ ​ఖుష్ అయిపోతుంది!

-రొటీన్​ గుత్తి వంకాయ కర్రీని మించిన టేస్ట్​ -ఈ పద్ధతిలో చేస్తే నిమిషాల్లో ప్రిపేర్​ అవుతుంది

By ETV Bharat Features Team

Published : 5 hours ago

SHAHI MALAI BAINGAN Recipe
Brinjal Malai Curry (ETV Bharat)

How to Make Brinjal Malai Curry: చాలా మంది ఇష్టపడి తినే రెసిపీలలో ఒకటి.. వంకాయ. అయితే, దీనితో మీరు ఇప్పటి వరకు గుత్తొంకాయ కర్రీ, పచ్చడి, వేపుడు.. వంటి రకరకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ.. అదే వంకాయలతో ఇంకేదైనా కొత్తగా వండాలనుకుంటే మాత్రం.. లఖ్​నవూ స్పెషల్ "మలై గుత్తొంకాయ కుర్మాను" ఈసారి ప్రయత్నించండి. దీన్ని అన్నంలోకే కాదు పులావ్, రోటీ.. ఇలా దేనితో తిన్నా టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది! మరి.. ఈ సూపర్ టేస్టీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గుత్తి వంకాయలు - 6
  • నెయ్యి - 2 టేబుల్​ స్పూన్లు
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • దాల్చినచెక్క - అంగుళం ముక్క
  • బిర్యానీ ఆకు - 1
  • యాలకులు - 4
  • లవంగాలు - 4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్​స్పూన్
  • షాహీ జీరా - 1 టీస్పూన్
  • కారం - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • మిరియాల పొడి - అరటీస్పూన్
  • బటర్/నెయ్యి - 1 టేబుల్​స్పూన్
  • పాలమీగడ - 2 టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

మసాలా పేస్ట్ కోసం :

  • వేపిన ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
  • జీడిపప్పు పలుకులు - 15 నుంచి 20
  • కర్బూజ గింజలు - 2 టీస్పూన్లు
  • పచ్చిమిర్చి - 4 నుంచి 5

గుత్తి వంకాయతో ఘుమఘమలాడే దమ్ బిర్యానీ - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ! - ఇలా ప్రిపేర్ చేయండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా నల్ల గుత్తి వంకాయలను తీసుకొని చాకుతో నాలుగు ముక్కలుగా మధ్యలోకి చీల్చుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడి అయ్యాక.. మధ్యలోకి చీల్చుకున్న వంకాయలను అందులో వేసి 60% వరకు వేపుకొని పక్కకు తీసుకోవాలి. అంటే.. వంకాయపైన స్కిన్ కాస్త రంగు మారితే చాలు. అంతకంటే ఎక్కువగా, ఎర్రగా వేయించుకుంటే కర్రీ రెడీ అయ్యేలోపు వంకాయలు చిదిరిపోతాయనే విషయం గుర్తుంచుకోవాలి.
  • అనంతరం రెసిపీలోకి కావాల్సిన మసాలా పేస్ట్​ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. మిక్సీ జార్​ తీసుకొని అందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కర్బూజ గింజలు, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చితో పాటు తగినన్ని వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని.. నెయ్యి, నూనె వేసుకోవాలి. ఆ మిశ్రమం వేడెక్కాక.. బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాహీ జీరా, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి వేసి 30 సెకన్ల పాటు వేయించుకోవాలి.
  • మసాలాలన్నీ నూనెలో వేగాక.. అందులో గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఆపై 300ml వేడి వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అందుకోసం.. 7 నుంచి 8 నిమిషాల టైమ్ పట్టొచ్చు.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక.. ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను అందులో వేసుకొని మరో 150 ఎంఎల్ వేడి వాటర్ పోసుకోవాలి.
  • ఆ తర్వాత మిరియాల పొడి వేసి కలిపి స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి వంకాయలను నిదానంగా మెత్తగా ఉడికించుకోవాలి. దీనికోసం 12 నుంచి 15 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • వంకాయలు మంచిగా ఉడికి పైన ఆయిల్ తేలుతున్నప్పుడు బటర్, పాల మీగడ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చాక దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే లఖ్​నవూ స్పెషల్ "మలై గుత్తొంకాయ కుర్మా" రెడీ!

నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్​ అదుర్స్​!

ABOUT THE AUTHOR

...view details