తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పప్పు రుబ్బకుండా 5 నిమిషాల్లో నోరూరించే 'బ్రెడ్ ఊతప్పం' చేసుకోండిలా! - దోశను మించిన టేస్ట్!! - BREAD UTTAPAM RECIPE

మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే రెసిపీ - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఫుల్ ఖుష్!

How to Make Bread Uttapam
Bread Uttapam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 1:02 PM IST

How to Make Bread Uttapam in Telugu :ఉదయం బ్రేక్​ఫాస్ట్​లోకి చాలా మంది ఇంట్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ, చపాతీ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, వీటిని ఎంత మార్చిమార్చి తిన్నా వారానికోసారైనా వాటి వంతొస్తుంది కనుక మళ్లీ వాటిని తినాలంటే కొంచం విసుగ్గానే అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ బ్రేక్​ఫాస్ట్​లోకి రొటిన్ రెసిపీలే కాకుండా ఓసారి బ్రెడ్ ఊతప్పం ట్రై చేయండి. ఇందుకోసం పిండి రుబ్బాల్సిన పనిలేదు! చాలా ఈజీగా 5 నుంచి 10 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజూ తినే దోశకంటే ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే వీటిని ఎంతో ఇష్టంగా తింటారు! మరి, ఆలస్యమెందుకు ఈ సూపర్ టేస్టీ ఇన్​స్టంట్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బ్రెడ్ స్లైసులు - 8
  • ఇడ్లీ రవ్వ - అరకప్పు
  • బియ్యప్పిండి - 2 చెంచాలు
  • పెరుగు - అరకప్పు
  • కొత్తిమీర తరుగు - అరకప్పు
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయలు - 2
  • టమాటా - 1
  • క్యారెట్ - 1
  • అల్లం - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్ - తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఉల్లిపాయలు, టమాటా, అల్లం, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. అలాగే క్యారెట్​ను తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. కొత్తిమీరనుసన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఆపై అందులో ఇడ్లీరవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఉప్పు, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని.. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కొత్తిమీర, అల్లం తరుగు, క్యారెట్తురుముతో పాటు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అయితే, పిండి మిశ్రమం మరీ గట్టిగా లేదా జారుగా ఉండకుండా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే ఊతప్పం చక్కగా, రుచికరంగా వస్తుంది.
  • ఇప్పుడు స్టౌపై దోశ పాన్ పెట్టుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఊతప్పం మాదిరిగా వేసుకోవాలి.
  • ఆపై అంచుల వెంబడి కాస్త నూనె వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. వీలైతే కాల్చుకునేటప్పుడు మరింత రుచికరంగా ఉండడానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత ప్లేట్​లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "బ్రెడ్ ఊతప్పం" రెడీ!

ABOUT THE AUTHOR

...view details