తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఆఫీస్​లో ఇలా చేస్తున్నారా? - అయితే మీ కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్లే! - CONTROL YOUR EMOTIONS AT WORKPLACE

ఆఫీస్​లో ఎమోషన్స్​ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? - ఇలా చేశారంటే ఆల్ సెట్!

HOW TO BE LESS EMOTIONAL AT WORK
Ways to Control Emotions at Workplace (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 4:06 PM IST

Simple Ways to Control Emotions at Workplace : ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్, నెగటివ్.. ఇలా రెండు రకాల భావోద్వేగాలు ఉంటాయి. అయితే, పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకపోయినా, నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం మనల్ని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయి. కాబట్టి, ముఖ్యంగా పనిచేసే చోట ఇలాంటి ఎమోషన్స్ అస్సలు ప్రదర్శించకూడదని చెబుతున్నారు నిపుణులు. లేదంటే వాటి ఎఫెక్ట్ కెరీర్​పై పడే ఛాన్స్​ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంతకీ, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కోపం :కొంతమంది పని ప్రదేశంలో వివిధ కారణాల వల్ల కోపం తెచ్చుకుంటుంటారు. అయితే, దానివల్ల నిరాశానిస్పృహలు ఆవహించడం తప్ప మరేం లాభం ఉండదు. కొందరు ఆ టైమ్​లో వచ్చిన కోపాన్ని ఇతరులపై చూపిస్తుంటారు. దాంతో పనీ పూర్తి అవ్వదు.. ఇతరులతోనూ అభిప్రాయభేదాలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. కాబ్టటి.. ఆఫీస్​, పని ప్రదేశంలో కోపగించుకునే ధోరణి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచించాలంటున్నారు. అలాగే ఈరోజే కచ్చితంగా కంప్లీట్ చేయాల్సిన పనులేంటో చూసుకొని వాటిని ముందుగా పూర్తి చేయడానికి ట్రై చేయాలి. ఆపై మిగతా పనులను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ద్వారా పని ఎక్కువగా ఉందనే చికాకు కలుగదు. మీరూ ప్రశాంతంగా ఉంటారంటున్నారు.

ఏడవడం : మంచి మంచి జాబ్స్ చేస్తూ ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారికీ ఇటు వృత్తిపరంగా, అటు వ్యక్తిగతంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక సతమతమవుతుంటారు కొందరు. కొన్నిసార్లు ఈ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఏడ్చేస్తుంటారు. కానీ, ఇలా తోటి ఉద్యోగుల ముందు, పైఅధికారుల ముందు ఏడవడం వల్ల వారికి మీరు చులకనయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి, ప్రాబ్లమ్ ఏదైనా భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడం, వాటి ప్రభావం చేసే పనిపై పడకుండా చూసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. మరీ అంతలా బాధనిపిస్తే మీకు కాస్త క్లోజ్‌గా ఉండే వారితో లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్​తో పంచుకొని దాని పరిష్కారం కోసం వారి హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు.

కొత్తగా జాబ్​లో చేరారా? ఈ బేసిక్ రైట్స్​ గురించి తెలుసుకోవడం మస్ట్!

అపరాధ భావం : చాలామంది ఉద్యోగులు.. పైఅధికారులు అప్పగించిన పనిని సరైన టైమ్​లో కంప్లీట్ చేయకపోయినా, పని చేయడానికి పెట్టుకున్న డెడ్‌లైన్లో అది పూర్తవకపోయినా, అందులో మిస్టేక్స్​ ఉన్నా.. వారి మనసుల్లో అపరాధ భావం మెదులుతుంటుంది. అయితే, దీని ఎఫెక్ట్ ఆ తర్వాత మనం చేసే పనులపై పడడంతో పాటు.. అది మన మనసునూ కుంగదీస్తుంది. అందుకే.. మీలో ఉన్న అపరాధ భావాన్ని వెంటనే తొలగించడం ఉత్తమం అంటున్నారు. ఇందుకోసం పదే పదే దాని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కాకుండా అనుకున్న టైమ్​లో పని పూర్తిచేయలేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకొని వాటిని రిపీట్ అవ్వకుండా చూసుకోవాలంటున్నారు. అలాగే మిస్టేక్స్ దొర్లకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫలితంగా మరోసారి ఈ భావన మనసులోకి రాకుండా.. పనిపై పూర్తి ఏకాగ్రత నిలిపి దాన్ని శ్రద్ధగా చేయగలుగుతారంటున్నారు నిపుణులు.

అసూయ :ఆఫీసన్నాక అందరు ఎంప్లాయిస్ ఒకే రకంగా వర్క్ చేయాలని, అందరి ఆలోచనలూ ఒకే తరహాలో ఉండాలని నిబంధన ఏమి లేదు. పని విషయంలో కొందరికి ఉత్తమమైన ఐడియాస్ రావచ్చు.. దాంతో వారు పైఅధికారుల ప్రశంసలు పొందచ్చు. ఇంకొందరు తటస్థంగానే ఉండచ్చు. అయితే, ఇలా తోటి ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు కొందరు వారిపై అసూయ పడుతుంటారు. అలాగే.. ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటుంటారు. కానీ, ఇలాంటి వాటి వల్ల ఇతరులకు మీపై చెడు అభిప్రాయం కలగడం తప్ప మరే ఉపయోగమూ ఉండదని గుర్తుంచుకోవాలి. అందుకే సహోద్యోగుల విషయంలో ఇలా ఆలోచించడం మాని.. మీకు తెలియని విషయాలు వారి నుంచి తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఉద్యోగులందరితో మంచిగా మెలుగుతూ.. వారి గెలుపుని మనస్ఫూర్తిగా అభినందించడం నేర్చుకోవాలి.

అభద్రతా భావం : కొత్తగా జాబ్​లో చేరినా, అందులో కొన్నేళ్ల అనుభవం గడించినా కొందరికి వారు చేసే ఉద్యోగం పట్ల అభద్రతా భావం ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వకపోవడం, ప్రతి విషయంలోనూ ఇతరులతో పోల్చుకోవడం.. వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. తద్వారా మీపై మరింత ఒత్తిడిపడి, చేస్తున్న పనిని సరిగ్గా కంప్లీట్ చేయలేరు. అందుకే.. పని విషయంలో అప్‌డేటెడ్‌గా ఉండడం, పోల్చుకోవడం మాని మీకు తెలియని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకోవడం వల్ల అభద్రత మీ దరి చేరకుండా జాగ్రత్తపడవచ్చంటున్నారు నిపుణులు. అలాగే కెరీర్‌లోనూ రాణించవచ్చని సూచిస్తున్నారు.

ఆఫీస్​ కంప్యూటర్​/ ఫోన్​ల్లో ఈ పనులు చేశారో - ఇక అంతే సంగతులు!

ABOUT THE AUTHOR

...view details