Amazing Benefits of Leftover Soap Shards :ప్రస్తుతం మార్కెట్లోకి రకరకాల లిక్విడ్ సబ్బులు వచ్చాయి. అయినప్పటికీ మనలో మెజార్టీ పీపుల్ స్నానం చేయడానికి సాధారణ సబ్బులనే వాడుతుంటారు. అయితే..అవి కాస్త అరిగి చేతికి అందకపోయే సరికి వాటిని పక్కన పెట్టేయడమో.. డస్ట్ బిన్లో వేయడమో చేస్తుంటారు. మీరు కూడా చిన్న ముక్కలను బయట పడేస్తున్నారా? వాటి ద్వారా పొందే ఈ ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అలా చేయరని అంటున్నారు నిపుణులు. మరి.. ఆ సబ్బు ముక్కలతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వార్డ్ రోబ్ ఫ్రెషనర్‌గా.. :మిగిలిన సబ్బు ముక్కలను డస్ట్‌బిన్‌లో వేసే బదులు ఇలా చేస్తే.. మంచి వార్డ్ రోబ్ ఫ్రెషనర్ లేదా క్లాసెట్ ఫ్రెషనర్‌గా యూజ్ అవుతాయంటున్నారు. ఇందుకోసం.. ఒక టిష్యూ పేపర్ లేదా క్లాత్ తీసుకొని మంచి సువాసనను వెదజవల్లే సబ్బు ముక్కలను అందులో చుట్టి వార్ట్ రోబ్ లేదా క్లాసెట్ లోపల పెట్టండి. ఫలితంగా.. అందులో ఉన్న చెడు వాసన పోయి మంచి వాసన వచ్చేలా చేస్తుందంటున్నారు నిపుణులు.
పిల్లల స్కూల్ షూస్‌లో : పిల్లల స్కూల్ సాక్సులు చాలా సార్లు దుర్వాసన వస్తుంటాయి. రోజూ క్లీన్ చేసినప్పటికీ.. వాళ్ల పొద్దంతా వాటిని ధరించి ఉండడంతో సహజంగానే చెమట దుర్వాసన వస్తాయి. సాక్సులతోపాటు బూట్లు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. ఇలాంటప్పుడు.. సబ్బు ముక్కలను ఓ కాగితంతో చుట్టి, రాత్రిపూట చిన్నారుల బూట్లలో పెడితే.. మర్నాటి కల్లా దుర్వాసన దూరమవుతుందని చెబుతున్నారు.
డోర్ సమస్యకు.. : ఇళ్లలో చెక్క తలుపులు ఉన్నప్పుడు కొన్నిసార్లు అవి జామ్ అయిపోయి ఓపెన్, క్లోజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. తెరిచినప్పుడు ఒక్కోసారి కిర్రుమనే శబ్ధం వస్తుంటుంది. అలాంటి టైమ్‌లో చిన్న సబ్బు ముక్క చాలా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంటే.. స్టక్ అయిన తలుపులు లేదా స్లైడర్లకు సబ్బును రాయండి. ఇలా చేయడం ద్వారా డోర్లు లేదా స్లైడర్లు బాగా తిరుగుతాయి. ఫలితంగా ఎలాంటి శబ్ధాలూ రావని చెబుతున్నారు.