తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "బనానా హల్వా" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి! - Banana Halwa Recipe - BANANA HALWA RECIPE

Banana Halwa Recipe in Telugu : హల్వా.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్‌ రెసిపీలలో ఒకటి. అలాంటి వారికోసం ఒక సూపర్ హల్వా రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "బనానా హల్వా". తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకునే ఈ హల్వాను ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు! మరి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Banana Halwa
Banana Halwa Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 1:41 PM IST

How to Make Banana Halwa Recipe :స్వీట్లు ఎన్ని రకాలు ఉన్నా.. అందులో హల్వాది ప్రత్యేక స్థానం. ఈ నోరూరించే స్వీట్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా హల్వాను ట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా "బనానా హల్వా" టేస్ట్ చేశారా? లేదు అంటే మాత్రం.. ఇప్పుడే ఓసారి ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీహల్వా(Halwa) తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • నెయ్యి - 4 నుంచి 6 టేబుల్ స్పూన్లు
  • అరటి పండ్ల గుజ్జు - 2 కప్పులు
  • పచ్చి యాలకుల పొడి - కొద్దిగా
  • బెల్లం - ముప్పావు కప్పు
  • తాటి బెల్లం - అర కప్పు
  • వాటర్ - ఒక కప్పు
  • జీడిపప్పు పలుకులు - గుప్పెడు

తయారీ విధానం :

  • ​ఇందుకోసం ముందుగా పండిన అరటిపండ్లను తీసుకొని 2 కప్పుల పరిమాణంలో గుజ్జును ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే.. బెల్లం, తాటి బెల్లాన్ని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి కాస్త వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరటిపండు గుజ్జు వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమాన్ని కలుపుతూ గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి.
  • అలాగే.. మరో బర్నర్ మీద ఇంకో పాన్ పెట్టుకొని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం పాన్​లో వాటర్ పోసుకొని.. తురిమి పెట్టుకున్న బెల్లం, తాటిబెల్లం వేసుకొని మరిగించుకోవాలి. అంటే.. బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అరటిపండు గుజ్జు బాగా వేగి కలర్ మారిందనుకున్నాక.. పచ్చియాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మరో 3-4 నిమిషాల పాటు మిశ్రమాన్ని వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమం బాగా చిక్కబడే వరకు మగ్గించుకోవాలి.
  • ఇక మిశ్రమం మంచిగా వేగి చిక్కగా మారిందనుకున్నాక.. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మరోసారి మిశ్రమాన్ని కాసేపు ఉడికించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం.. ఒక బేకింగ్ డిష్​ తీసుకొని అన్ని వైపులా నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న హల్వాను అందులో వేసుకొని మరికొన్ని జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి.
  • ఆపై దాన్ని గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరమైన నోరూరించే "బనానా హల్వా" రెడీ!

ABOUT THE AUTHOR

...view details