How to Make Banana Barfi Recipe : చాలా మందికి స్వీట్స్ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా స్వీట్స్ చూడగానే నోరూరుతుంది. అయితే, మిఠాయి దుకాణాల్లో దొరికే స్వీట్స్ ఆరోగ్యానికి అంత మంచివి కాకపోవచ్చు. కాబట్టి, ఈసారి ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇలా "బనానా బర్ఫీని" ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అరటిపండు తినడానికి ఇష్టపడని వారు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీని కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. తక్కువ పదార్థాలతో ఎవరైనా చాలా సింపుల్‌గా ఈ స్వీట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీకి అవసరమైన పదార్థాలేంటి? తయారీ విధానమేంటి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ముప్పావు కప్పు - గోధుమపిండి
- 1 కప్పు - పంచదార
- పావు కప్పు - ఉప్మారవ్వ
- 4 - అరటిపండ్లు
- 4 టేబుల్‌స్పూన్లు - నెయ్యి
- అరకప్పు - బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు
- పావుచెంచా - యాలకుల పొడి
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా అరటిపండ్లనుముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని రెండు టేబుల్‌స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక.. బాదం, పిస్తా, జీడిపప్పులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం అదే కడాయిలో గోధుమపిండి వేసి కలుపుతూ వేయించుకోవాలి. అది కాస్త వేగాక.. ఉప్మారవ్వ యాడ్ చేసుకొని వేయించి దించేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద మరో పాత్ర పెట్టుకొని కప్పు వాటర్ పోసుకొని పంచదార, యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి.
- పాకం కాస్త చిక్కబడ్డాక.. వేయించి పక్కన పెట్టుకున్న గోధుమపిండి మిశ్రమం, ఇంకాస్త నెయ్యి, వేయించుకున్న డ్రైఫ్రూట్స్ పలుకులు కొన్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించాలి.
- బర్ఫీ మిశ్రమం కడాయిలో అంటుకోకుండా విడిపోయినప్పుడు స్టౌ ఆఫ్ చేసుకొని కడాయి దించేసుకోవాలి. ఆపై ఒక ట్రేలో నెయ్యి కాస్త అప్లై చేసుకొని అందులో మీరు ప్రిపేర్ చేసుకున్న బర్ఫీమిశ్రమాన్ని వేసుకొని సమంగా సర్దాలి.
- ఆ తర్వాత దాని మీద మిగిలిన డ్రైఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. ఆపై మీకు కావాల్సిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బనానా బర్ఫీ" రెడీ.
- మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఇంట్లిపాదీ ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు!