తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బ్యాచిలర్స్ స్పెషల్ "చికెన్ ఫ్రై" - ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే! - BACHELORS CHICKEN FRY

నిమిషాల్లో చేసుకునే బ్యాచిలర్స్ స్పెషల్ చికెన్ రెసిపీ - టేస్ట్ అద్దిరిపోతుంది!

BACHELORS CHICKEN FRY
Chicken Fry (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 7:55 PM IST

How to Make Chicken Fry in Telugu :ఇంట్లో కూరగాయలు, కుకింగ్ ఇంగ్రీడియంట్స్ సరిపడా లేకపోతే వంట చేయడం పెద్ద సవాల్​. ఇక, బ్యాచిలర్స్ కష్టాలు చెప్పాల్సిన పనేలేదు. ఈ క్రమంలోనే చాలా మంది చికెన్​ వండుకోవాలనుకున్నప్పుడు కిచెన్​లో అందులోకి కావాల్సిన మసాలా దినుసులు, ఇంగ్రీడియంట్స్ లేవని బాధపడుతుంటారు. అలాంటి వారికోసమే వంటింట్లో అందుబాటులో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకునేలా ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "బ్యాచిలర్స్ స్పెషల్ చికెన్ ఫ్రై".

ఈ రెసిపీని తక్కువ సమయంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడూ చికెన్​ని ఒకేలా తిని బోరింగ్​గా అనిపించిన వారు దీన్ని ట్రై చేయొచ్చు. టేస్ట్​ అద్దిరిపోతుంది! ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అరకేజీ
  • నూనె - తగినంత
  • పచ్చిమిర్చి - 4
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
  • పసుపు - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్​వి)
  • టమాటా - 1
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • గరంమసాలా - అరటీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

బ్యాచిలర్​ బ్రోస్..​ వంట తేడా కొట్టేస్తే ఏం చేస్తారు? - ఈ టిప్స్ పాటస్తే నో టెన్షన్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చికెన్​ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్​ని వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద 7 నుంచి 8 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే పసుపు యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు కాస్త కలర్ మారి మిశ్రమంలో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో ఉప్పు, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పాన్​పై మూత పెట్టి స్టౌను లో ఫ్లేమ్​ ఉంచి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ పది నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ, టమాటా మంచిగా ఉడికి, చికెన్ ఎర్రగా వేగి కనిపిస్తుంది. అలా వేగిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్ మీద మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • అలా వేయించుకున్నాక చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "బ్యాచిలర్స్ స్పెషల్ చికెన్ ఫ్రై" రెడీ!

బ్యాచిలర్స్​ కడుపు నింపే టేస్టీ "రసం రైస్" - ఇక కర్రీ అవసరమే లేదు! - పది నిమిషాల్లోనే సిద్ధం!

ABOUT THE AUTHOR

...view details