Valentine Week 2025 List Date:ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే వాలంటైన్ వీక్ వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరిగే ఈ ప్రేమికుల వారం జంటల మధ్య విడదీయరాని బంధాన్ని బలపరుస్తుందని భావిస్తుంటారు. ప్రేమ మనస్సులు దోబూచులాడే ఆ వారం లవర్స్‌కు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. హగ్ డే, కిస్ డే, టెడ్డీ డే, వాలంటైన్స్ డే అని ఇలా రకరకాల కార్యక్రమాలు ఈ వారంలో జరుగుతాయి. ప్రేమికులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకుంటూనే.. తమ భావాలను వ్యక్తపరుచుకుంటూ ఆనంద లోకంలో తేలియాడుతుంటారు. మరి వారం రోజులపాటు సాగే ఈ ప్రేమ పండుగలోని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిబ్రవరి 7 రోజ్ డే:వాలంటైన్ వీక్‌లో మొదటిరోజు రోజ్ డే. ఈ ప్రేమ వారంలో మొదటి రోజున అందమైన గులాబీ పువ్వులను తమకిష్టమైన వారికి ఇచ్చి తమ ప్రేమ సందేశాన్ని పంపుతారు. ఆ వ్యక్తులు తమ జీవితంలో ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ గులాబీల ద్వారా తెలియజేస్తారు. గులాబీలతో ప్రేమ మాధుర్యాన్ని తమ ప్రియసఖికి చెబుతారు. చాలా మంది ప్రేమకు చిహ్నంగా ఎర్ర గులాబీలను ఇచ్చుకుంటారు.
ఫిబ్రవరి 7 రోజ్ డే (Getty Images) ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే:రోజ్ డే తర్వాత వచ్చేది ప్రపోజ్ డే. ఈ రోజును తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయడానికి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. చాలా మంది వారికి ఇష్టమైన వారికి తమ ప్రేమ గురించి చెబుతుంటారు. తమ ప్రియ సఖికి చెప్పాలనుకున్న ఎన్నో విషయాలను ఈరోజే వ్యక్తపరుస్తారు.
ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే (Getty Images) ఫిబ్రవరి 9 చాక్లెట్ డే:వాలంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. చాక్లెట్లు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు అయితే, కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ నేపధ్యంలోనే ఈ రోజున ప్రేమికులు ఒకరికి ఒకరు చాక్లెట్లను ఇచ్చుకొని తమ ప్రేమను వ్యక్త పరుచుకుంటారు.
ఫిబ్రవరి 9 చాక్లెట్ డే (Getty Images) ఫిబ్రవరి 10 టెడ్డీ డే:చాలా మంది అమ్మాయిలకు టెడ్డీలంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందుకే వాలంటైన్ వీక్‌లో నాలుగో రోజు టెడ్డీ డేగా జరుపుకొంటారు. ఈరోజున అబ్బాయిలు తమ ప్రేయసిని ఆనంద పరచడానికి టెడ్డీలను బహుమతులుగా ఇస్తుంటారు. ప్రేమ, ఆప్యాయతకు టెడ్డీ బేర్స్ ప్రతీకని.. మనకు ఇష్టమైన వారికి టెడ్డీను గిఫ్ట్‌గా ఇస్తే వారి మనస్సు ఆనంద లోకంలో విహరిస్తుంటుందని భావిస్తుంటారు.
ఫిబ్రవరి 10 టెడ్డీ డే (Getty Images) ఫిబ్రవరి 11 ప్రామిస్ డే:వాలంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే. ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు తొడుగా ఉండాలని.. మనుషులు ఇద్దరైనా మనసులు ఒకటై కలకాలం ప్రేమతో ఒకరికి ఒకరం తోడుగా ఉండాలని ప్రామిస్‌లు చేసుకుంటారు ప్రేమికులు. ఒకరిపై ఒకరు తమ ప్రేమను పంచుకుంటూ కష్టసుఖాల్లో తోడుగా నిలవాలని మాట ఇచ్చుకుంటారు. ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని ప్రామిస్ అనేది మరింత పెంచుతుంది.
ఫిబ్రవరి 11 ప్రామిస్ డే (Getty Images) ఫిబ్రవరి 12 హగ్ డే:వాలంటైన్ వీక్‌లో ఆరో రోజు హగ్ డే. ఎన్ని బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నా ప్రేమతో ఇచ్చే ఒక హగ్.. వారిద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. అందుకే ప్రేమికులు ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకొని లోతైన ప్రేమతో ఈరోజున ఆలింగనం చేసుకుంటారు. ఇంకా మాటల్లో చెప్పలేని ప్రేమను ప్రేమికులు ఇలా హగ్‌తో చెప్పుకుంటారు. పదాలు చెప్పలేని భావన మంచి కౌగిలి చెప్పగలదని నిపుణులు అంటుంటారు.
ఫిబ్రవరి 12 హగ్ డే (Getty Images) ఫిబ్రవరి 13 కిస్ డే: వాలంటైన్ వీక్‌లో ఏడో రోజు కిస్ డే. ముద్దు అనేది ఎనలేని ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఒక వ్యక్తిపై ఎంత ప్రేమ ఉందో ఒక ముద్దు తెలియజేస్తుంది. అందుకే ప్రేమికులు తమ అమితమైన ప్రేమను ఒకరితో ఒకరు పంచుకొనేందుకు ప్రేమగా ముద్దులు పెట్టుకుంటారు. లవర్స్ మధ్య ప్రేమ మరింతగా పెరిగేలా చేస్తుందీ ముద్దు.
ఫిబ్రవరి 13 కిస్ డే (Getty Images) ఫిబ్రవరి14 వాలంటైన్స్ డే:ఇక ఈ వారంలో చివరిరోజు వాలంటైన్స్ డే. ఇది ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైన ప్రేమికుల రోజు. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ బంధం చిరకాలం కొనసాగేలా ఈ వేడుకను జరుపుకొంటారు. ప్రేమ మాటలతో దోబూచులాడుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూనే.. తమ జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిలిపోయేలా ఈరోజును చేసుకుంటారు. తమ జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకాలను ప్రేమికులు ఈ వారంలోనే పొందుతారట.
ఫిబ్రవరి14 వాలంటైన్స్ డే (Getty Images) తాతయ్య వయసులో నాన్నా అనిపించుకుంటారా? - అసలేం జరుగుతోందంటే!
మీ పిల్లలు ఫోన్ చూస్తూ సరిగ్గా చదవట్లేదా? ఇలా చేస్తే ఏకాగ్రత, ఇంట్రెస్ట్ పెరగుతుందని సలహా!