తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

టీతో పాటు సిగరెట్ తాగుతున్నారా?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే! - Cigarette with Tea - CIGARETTE WITH TEA

Cigarette with Tea : చాలా మంది టీ తాగుతూ సిగరెట్ కాలుస్తుంటారు. అయితే, అలా టీ, సిగరెట్​ కలిపి తాగడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Cigarette with Tea
Cigarette with Tea (ETV Bharat)

By ETV Bharat Lifestyle Team

Published : Oct 1, 2024, 9:56 AM IST

Updated : Oct 1, 2024, 10:09 AM IST

Cigarette with Tea : ఆఫీసులో పని చేస్తూ అలసిపోయినప్పుడు, ఫ్రెండ్స్​తో కలిసి బయటికి వెళ్లినప్పుడు... రిఫ్రెష్ అవ్వడం కోసం చాలా మంది మధ్యలో టీ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే, కొందరు మాత్రం 'టీ' తాగుతూ దానితో పాటుగా 'సిగరెట్' కాలుస్తుంటారు. అలా టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. టీ, సిగరెట్లను కలిపి తాగడం వల్ల గుండె జబ్బు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు పరిశోధకులు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టీతో పాటుగా సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆ అధ్యయనం ప్రకారం... ధూమపానం, మద్యపానం చేసేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, టీతో కలిపి సిగరెట్ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం పెరుగుతుందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, వేడి టీ జీర్ణ కణాలను దెబ్బతీస్తుందని, టీ-సిగరెట్‌ను కలిపి తాగడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతినే ప్రమాదం రెండు రెట్లు పెరుగుతుందని పరిశోధనలో తెలింది.

టీలో కెఫీన్ ఉంటుందని, దీని వల్ల కడుపులో జీర్ణక్రియకు సహాయపడే ప్రత్యేక యాసిడ్ ఉత్పత్తి అవుతుందని, అయితే ఎక్కువ కెఫిన్ కడుపులోకి చేరితే హానికరం అంటున్నారు నిపుణులు. సిగరెట్ లేదా బీడీలలో నికోటిన్ ఉంటుందని.. టీ, సిగరెట్‌ రెండూ రక్తపోటును పెంచుతాయని నిపుణలు చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. టీ, సిగరెట్‌ కలిసి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇది అజీర్తి, మలబద్ధకం, అల్సర్స్ లాంటి ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలవాటు మానడం ఎలా : చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా వీటికి అలవాటు పడతారని నిపుణలు చెబుతున్నారు. ఈ అలవాటు దీర్ఘకాలికంగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ అలవాట్లను మార్చుకోవడం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ప్రతి రోజూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, మంచి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మీరు సిగరెట్ అలవాటును మానేయడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే, డాక్టర్​ను సంప్రదించాలని నిపుణలు సూచిస్తున్నారు.

టీ, సిగరెట్ తాగడం వల్ల కలిగే నష్టాలు?

  • గుండెపోటు ప్రమాదం
  • అన్నవాహిక క్యాన్సర్
  • గొంతు క్యాన్సర్
  • నపుంసకత్వము, వంధ్యత్వం యొక్క ప్రమాదం
  • కడుపు పూత
  • చేతులు, కాళ్ల పూత
  • జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం
  • బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ప్రమాదం
  • తక్కువ ఆయుర్దాయం
  • ఊపిరితిత్తుల క్యాన్సర్

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ 'గుండె' ఎంతో స్పెషల్- జాగ్రత్తగా కాపాడుకోండి - Take Care of Your Heart

ఒత్తిడిని తగ్గించే యోగాసనాలు- మీరు ట్రై చేస్తారా? - Yoga for Stress Relief

Last Updated : Oct 1, 2024, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details