ETV Bharat / lifestyle

తల్లి ఊబకాయం- పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుపై ప్రభావం! - Effects Of Maternal Obesity On Baby - EFFECTS OF MATERNAL OBESITY ON BABY

Effects Of Maternal Obesity On Baby : గర్భధారణకు ముందు, గర్భం ధరించిన సమయంలో ఊబకాయం గల మహిళలకు పుట్టే పిల్లలకు ఆటిజమ్, ఏడీహెచ్‌డీ వంటి నాడీ అభివృద్ధి సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రతలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Maternal Obesity
Maternal Obesity (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Oct 2, 2024, 11:53 AM IST

Effects Of Maternal Obesity On Baby : గర్భధారణకు ముందు, గర్భం ధరించిన సమయంలో ఊబకాయం గల మహిళలకు పుట్టే పిల్లలకు ఆటిజమ్, ఏడీహెచ్‌డీ వంటి నాడీ అభివృద్ధి సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో బయటపడింది. ఏడీహెచ్‌డీ పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుందని వెల్లడైంది. ఇలాంటి పిల్లలు కాసేపు అయినా దేని మీదా శ్రద్ధ పెట్టరని, అతి చురుకు దనంతో ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆటిజమ్‌ పిల్లలైతే ఒకే విధంగా పనులు చేస్తుంటారని.. ఇతరులతో మాట్లాడటం, కలవటంలో ఇబ్బంది పడతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి ఎందుకొస్తాయనేది కచ్చితంగా తెలియదు గానీ కారణాలను అన్వేషించటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన పరిశోధనలు వారి ఓ కొత్త దారిని చూపాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం.

యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియాతో పాటు ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు ఊబకాయం గల మహిళకు సంబందించిన 42 అధ్యయనాలను సమీక్షించారు. అందులో భాగంగా సుమారు 36 లక్షల మాతా, శిశు జంటల వివరాలు పరిశీలించారు. గర్భధారణ సమయంలో మహిళల్లో ఊబకాయం కారణంగా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు 32% పెరుగుతున్నట్టు అలాగే ఆటిజమ్‌ ముప్పు రెట్టింపవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే గర్భం ధరించటానికి ముందు అధిక బరువు, ఊబకాయం మూలంగా ఏడీహెచ్‌డీ ముప్పు వరుసగా 18%, 57% అధికంగా ఉంటున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. ఇక ఆటిజమ్‌ విషయానికి వస్తే- గర్భధారణకు ముందు అధిక బరువుతో 9%, ఊబకాయంతో 42% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పిల్లలకు ప్రవర్తన సమస్యలు వచ్చే అవకాశం 30%, తోటివారితో కలవలేకపోయే ముప్పు 47% అధికమనీ వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా సంతానం కనే వయసులో ఉన్న మహిళల్లో ఊబకాయం, పిల్లల్లో ఏడీహెచ్‌డీ వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల మానసిక ఆరోగ్యం మీద ఊబకాయం దీర్ఘకాల ప్రభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పరిశోధకులు వెల్లడిస్తున్నాురు.

ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆఫీసు లేదా ఇతర ప్రదేశాలకు వాహనాలు తప్పకున్నా కూరగాయల మార్కెట్టు, కొద్ది దూరంలో ఉన్న బంధుమిత్రుల ఇళ్లకు లేదా పార్కుకు కాలి నడకన వెళ్లడం అలవాటు చేసుకుంటే అది మంచి వ్యాయామం అవుతుంది. ఊబకాయ సమస్యలు తగ్గుతాయని, అనారోగ్యాలూ దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.

మనకు బయట దొరికే పిజ్జాలూ, బర్గర్లూ, బజ్జీలూ, బోండాలు లాంటి ఆహార పదార్థాలను మానేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఫలహారం చేసుకుని తినే వీలూ వసతీ లేకుంటే కాసిని అటుకులు కొద్దిగా పాలల్లో వేసుకు తినడం లాంటి మార్గాలను చూసుకోవాలంటున్నారు. మన ఆరోగ్యం గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.! ఇంటి తిండిలో నూనె పదార్థాలు తగ్గించుకోవాలని, ఆకలి తీరడానికి ఏదో ఒకటి అనుకోకుండా సంపూర్ణ పోషకాహారం తగినంత తినాలని చెబుతున్నారు. టీ, కాఫీలను తగ్గించాలని.. శీతల పానీయాలూ జంక్‌ఫుడ్‌ జోలికి అసలే వెళ్లవద్దని నిపుణులు చెబుతున్నారు. మనదేశ మహిళల్లో అధిక బరువు వల్ల మధుమేహం, హృద్రోగం, గుల్ల ఎముకల వ్యాధులతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గుండెపోటు నుంచి పాము కాటు వరకు 10 రకాల ప్రథమ చికిత్సల వివరాలు- మీరు తెలుసుకోండి - First Aid Instructions

విటమిన్స్ డెఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నారా?- అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..! - IMMUNITY BOOSTING VITAMINS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.