How to Make Mixed Vegetable Pickle: మీరు టమాటా, మామిడి, నిమ్మకాయ పచ్చడి తినే ఉంటారు. ఇంకా వీటితో పాటు రకరకాల కూరగాయాలతో కూడా పచ్చళ్లు చేసుకుని తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా కూరగాయలను కలిపి మిక్స్డ్ వెజ్ పచ్చడి ట్రై చేశారా? అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంట్లో రెండు, మూడు కూరగాయలు మిగిలినప్పుడు లేదా మీకు నచ్చిన కూరగాయలన్నింటిని వేసి దీనిని తయారు చేసుకోవచ్చు. దీనిని ఇన్స్టంట్గా చాలా రుచికరంగా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఒకసారి చేస్తే నాలుగు రోజుల వరకు.. ఫ్రిజ్లో పెడితే మరిన్ని రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక టేబుల్ స్పూన్ ఆవాలు
- ఒక టేబుల్ స్పూన్ మెంతులు
- ఒక క్యాలీఫ్లవర్ తరిగిన ముక్కలు
- ఒక క్యారెట్ ముక్కలు
- మగ్గించిన రెండు నిమ్మకాయ ముక్కలు
- ఒక పచ్చి మామిడికాయ ముక్కలు (ఆప్షనల్)
- రెండు పచ్చిమిరపకాయలు
- 10 వెల్లుల్లి రెబ్బలు
- చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క
- ఒక టేబుల్ స్పూన్ ఉప్పు
- మూడు టేబుల్ స్పూన్ల ఎండుకారం
- రెండు టీ స్పూన్ల మెంతిపిండి
- రెండు టీస్పూన్ల ఆవపిండి
- రెండు నిమ్మకాయల రసం
తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు
- రెండు టేబుల్ స్పూన్ల నూనె
- అర టీ స్పూన్ ఆవాలు
- మూడు ఎండు మిరపకాయలు
- అర టీ స్పూన్ ఇంగువ