తెలంగాణ

telangana

ETV Bharat / international

'నేనేం మలాలాను కాను- పరిగెత్తి వేరే దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదు' - యాకే పార్లమెంట్ సంకల్ప్ దివస్

Yana Mir On Malala : భారత్​లో భాగమైన కశ్మీర్​లో తాను సురక్షితంగా ఉన్నట్లు యూకే పార్లమెంట్​లో కశ్మీరీ మహిళ యాన్ మీర్ తెలిపారు. తాను మాలాలాను కాదని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్​ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

Yana Mir On Malala
Yana Mir On Malala

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 3:31 PM IST

Yana Mir On Malala : అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్​ ప్రాంతంపై పాకిస్థాన్​ చేస్తున్న ప్రచారాన్ని కశ్మీరీ కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు. భారత్​లో భాగమైన కశ్మీర్​లో తాను పూర్తి సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నట్లు తెలిపారు. బ్రిటన్​ పార్లమెంట్​లో నిర్వహించిన సంకల్ప్ దివస్​లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్​ ప్రజలను విభజించడం ఆపివేయాలని అంతర్జాతీయ మీడియాను కోరారు.

"నేను మలాలా యూసుఫ్‌జాయ్‌ను కాదు. ఎందుకంటే నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. నా స్వదేశం, భారత్​లో భాగమైన కశ్మీర్‌లో ఉన్నారు. నాకు పరిగెత్తి వేరే దేశంలో ఆశ్రయం పొందవలసిన అవసరం లేదు. నేను ఎప్పటికీ మలాలా యూసుఫ్‌జాయ్ కాను. నా దేశాన్ని అణచివేతకు గురిచేసి పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. కశ్మీర్‌ను సందర్శించడానికి ఎప్పుడూ ఇష్టపడని అంతర్జాతీయ మీడియా- అక్కడ అణచివేత జరుగుతుందటూ వేస్తున్న కథనాలను వ్యతిరేకిస్తున్నాను" అని మీర్ తెలిపారు.

"మత ప్రాతిపదికన భారతీయులను విభజించడం మానేయాలని కోరుతున్నాను. సంకల్ప్ దివస్ సందర్భంగా యూకే, పాకిస్థాన్​లో ఉన్న కొందరు అంతర్జాతీయ మీడియా ద్వారా నా దేశాన్ని కించపరచడం మానేస్తారని నేను ఆశిస్తున్నాను. ఉగ్రవాదుల కారణంగా ఇప్పటికే వేలాది మంది కశ్మీరీ తల్లులు తమ కుమారులను కోల్పోయారు. ఇప్పటికైనా కశ్మీర్ ప్రజలను ప్రశాంతంగా జీవించేలా చూడండి"

-- యానా మీర్​, కశ్మీరీ కార్యకర్త

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంత పురోగతిని వివరించారు యానా మీర్. మెరుగైన భద్రత లభిస్తుందని, నిధులు కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పారు. భారత సైన్యాన్ని కూడా ప్రశంసించారు. పాకిస్థాన్​ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు భారత్​కు కచ్చితంగా ఉందని స్పష్టం చేశారు.

యూకే పార్లమెంట్​లో జమ్ముకశ్మీర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆ దేశ పార్లమెంట్ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు, కమ్యూనిటీ నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ఎంపీ బాబ్ బ్లాక్‌మన్, ఎంపీ థెరిసా విలియర్స్, ఎంపీ ఇలియట్ కోల్‌బర్న్, ఎంపీ వీరేంద్ర శర్మ ఉన్నారు. ఈ కార్యక్రమంలో డైవర్సిటీ అంబాసిడర్ అవార్డును అందుకున్నారు యానా మీర్.

ABOUT THE AUTHOR

...view details