తెలంగాణ

telangana

ETV Bharat / international

కమలా హారిస్​తో డిబేట్​కు ట్రంప్‌ రె'ఢీ'- కానీ షరతులు వర్తిస్తాయి! - trump agrees to debate harris - TRUMP AGREES TO DEBATE HARRIS

Trump agrees to debate with Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​తో సెప్టెంబరు 10న జరిగే డిబేట్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తన సోషల్‌ మీడియా ప్లాట్​ఫామ్‌ ట్రూత్​లో ట్రంప్ వెల్లడించారు.

Trump agrees to debate with Kamala Harris
Trump agrees to debate with Kamala Harris (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 11:10 AM IST

Trump agrees to debate with Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్‌, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య జరగబోయే డిబేట్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ డిబేట్‌ అంశమై డొనాల్ట్ ట్రంప్ స్పందించారు. డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​తో డిబేట్‌ కోసం ఒప్పదం కుదుర్చుకున్నట్లు తన సోషల్‌ మీడియా ప్లాట్​ఫామ్‌ ట్రూత్​లో పోస్టు పెట్టారు. అలాగే ఈ భేటీకి సంబంధించిన నిర్దిష్ట షరతులు, నియమాలను ట్రంప్‌ తెలిపారు.

"కామ్రేడ్ కమలా హారిస్​తో సెప్టెంబర్ 10న ఫిలడెల్ఫియాలో జరిగే డిబేట్‌ కోసం నేను రాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్​లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఏబీసీ ఫేక్‌ న్యూస్​లో ఈ డిబేట్ ప్రసారమవుతుంది. కాకపోతే అది అత్యంత అన్యాయమైన వార్తా సంస్థ" అని తన సోషల్ సోషల్‌ మీడియా ప్లాట్​ఫామ్‌ ట్రూత్​లో పోస్టు పెట్టారు. ఈ డిబేట్ విషయంలో ట్రంప్​నకు అనేక అభ్యంతరాలు ఉన్నాయని, కనుక దానిని రద్దు చేసుకునే అవకాశముందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆయన కమలా హారిస్​తో చర్చకు అంగీకరించడం గమనార్హం.

నియమాలు ఇవే!
జూన్‌ 27న సీఎన్ఎన్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో జరిగిన డిబేట్​లో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను, కమలా హారిస్‌ ఒప్పందానికి వచ్చినట్లు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్‌ తెలిపారు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని వెల్లడించారు. అభ్యర్థులు మాట్లాడనప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్‌ చేసి ఉంటాయని తెలిపారు.

"చివరిసారిగా సీఎన్ఎన్ డిబేట్లో అనుసరించిన నిబంధనలే ఇందులోనూ ఉంటాయి. అయితే ఈ నిబంధనలు అధ్యక్షుడు జో బైడెన్‌కు మినహా అందరికీ బాగా అనిపించాయి. డిబేట్​లో అభ్యర్థులు నిలబడి మాట్లాడుతారు. అభ్యర్థులు నోట్స్ లేదా షీట్లు తీసుకురావటం ఉండదు. ఇక ఈ డిబేట్‌ న్యాయమైన చర్చగా ఉంటుందని, ఏ పక్షానికీ ముందుగానే ప్రశ్నలు ఇవ్వటం జరగదని ఏసీబీ మాకు హామీ ఇచ్చింది. సెప్టెంబర్ 4న ఫాక్స్‌ న్యూస్ డిబేట్​కు కమల హారిస్ అంగీకరించలేదు. ఆమె మనసు మార్చుకుంటే అదే రోజు డిబేట్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు - ఎవరు గెలిచినా ఆ ప్రభావం భారత్​పై ఉంటుందా? - US President Election Pratidhwani

'ఆయన​ ప్రెసిడెంట్​ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే!'- DNCలో ట్రంప్​పై విరుచుకుపడ్డ కమలా హారిస్ - Kamala Harris Acceptance Speech

ABOUT THE AUTHOR

...view details