Russia Hit With 9/11 Style Attack : రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు ప్రతిదాడులు ఉద్ధృతంగా సాగుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో రష్యా నగరాలపై దాడుల తీవ్రతను ఉక్రెయిన్ మరింత పెంచింది. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని కజాన్ నగరాన్ని వణికించాయి. కజాన్ నగరంపైకి ఉక్రెయిన్ ఎనిమిది డ్రోన్లు ప్రయోగించగా, 6 డ్రోన్లు బహుళ అంతస్తుల భవంతులను తాకాయి. మరొకటి పారిశ్రామిక ప్రాంతంలో పడింది. ఒక దానిని రష్యా గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేయగా అది నదిలో పడింది.
రష్యాపై 9/11 తరహా దాడి - కజాన్ పట్టణంపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ - UKRAINE DRONE ATTACK ON RUSSIA
ఢీ అంటే ఢీ - రష్యాలోని కజాన్ నగరంపై ఉక్రెయిన్ ఎటాక్ - జెలెన్‌స్కీ స్వగ్రామంపై రష్యా వైమానిక దాడి
Published : 16 hours ago
అయితే ఒక డ్రోన్‌కు సంబంధించిన దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దాడి అచ్చం న్యూయార్క్‌లో జరిగిన 9/11 దాడుల తరహాలోనే ఉంది.ఉక్రెయిన్‌కు చెందిన మానవరహిత డ్రోన్ బహుళ అంతస్తు భవనంలోకి చొచ్చుకెళ్లింది. ఫలితంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వివరించారు. కజాన్‌లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు రష్యా మీడియా పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడ కుండా రెండు రోజుల పాటు అధికారులు ఆంక్షలు విధించారు.
జెలెన్‌స్కీ స్వగ్రామంపై రష్యా వైమానిక దాడి
రష్యా సైతం ఉక్రెయిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వగ్రామంపై రష్యా వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలిక సహా ఆరుగురు గాయపడ్డారు. మూడు బహుళ అంతస్తుల భవనాలు, 17 నివాసాలు, పలు వాహనాల సైతం దెబ్బతిన్నాయి. రష్యా 113 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వాటిలో 57 డ్రోన్లను తమ వైమానిక శాఖ కూల్చివేసిందని వెల్లడించారు. మరో 56 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పారు.