ETV Bharat / offbeat

కమ్మని "టమాట పచ్చడి" - ఇలా చేస్తే సూపర్​ టేస్ట్​తో పాటు నెలల పాటు నిల్వ! - HOW TO MAKE TOMATO NILVA PACHADI

వేడి వేడి అన్నంలో అదుర్స్​ అనిపించే టమాట పచ్చడి ఇలా చేస్తే సూపర్​ టేస్ట్​తో పాటు నిల్వ కూడా!

How to Make Tomato Nilva Pachadi
How to Make Tomato Nilva Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2025, 2:17 PM IST

How to Make Tomato Nilva Pachadi: పచ్చళ్లు అనగానే ఎక్కువ మందికి ఆవకాయతో పాటు టమాట పచ్చడి గుర్తొస్తుంది. అందుకే చాలా మంది దీన్ని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే మెజార్టీ జనం టమాటలతో నిల్వ పచ్చడి పెట్టుకుంటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుని తింటే ఆరోజు గడిచిపోతుంది. అందుకే ఇదీ ఎప్పుడూ బోర్​ కొట్టొదు. అయితే ఈ రోజుల్లో పచ్చడి ప్రిపేర్​ చేసుకునే తీరిక లేక, పెట్టడం రాక చాలా మంది మార్కెట్లో తయారు చేసిన పచ్చళ్లను కొంటున్నారు. అయితే ఇప్పుడా అవసరం లేకుండా సూపర్​ టేస్టీగా పైగా నెలల పాటు నిల్వ ఉండేలా టమాట పచ్చడి పెట్టుకోండి. సూపర్​గా ఉంటుంది. మరి, లేట్​ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సినవి పదార్థాలు, తయారీపై ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • టమాటలు - అరకేజీ
  • నూనె - 1 టీ స్పూన్​
  • చింతపండు - 50 గ్రాములు
  • మెంతులు - 1 టీ స్పూన్​
  • ఆవాలు - 2 టీ స్పూన్లు
  • పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బులు - పావు కప్పు
  • కారం - అర కప్పు
  • ఉప్పు - పావు కప్పు

తాలింపు కోసం:

  • నూనె - అరకప్పు
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్​
  • మినపప్పు - 1 టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • టమాటలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె, టమాట ముక్కలు, చింతపండు వేసి కలిపి మూత పెట్టి సిమ్​లో ముక్కలు మెత్తగా, నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి.
  • టమాట ముక్కలు ఉడికిన పాన్​ను పక్కకు పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అదే స్టవ్​ మీద మరో పాన్​ పెట్టి ఆవాలు, మెంతులు దోరగా వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఆవాలు, మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు అదే మిక్సీజార్​లోకి ఉడికించిన టమాట ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కారం, ఆవాలు మెంతి పిండి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. అయితే రుచి చూసి ఉప్పు, కారం సరిచూసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు, పసుపు వేసి వేయించుకోవాలి.
  • చివరగా గ్రైండ్​ చేసుకున్న టమామ మిశ్రమం వేసుకుని బాగా కలిపి గాలి పోని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే టమాట నిల్వ పచ్చడి రెడీ. అయితే ఈ పచ్చడిని ఫ్రిజ్​లో పెట్టుకుంటే ఆరు నెలలు, బయటైతే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.
  • ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్​ చేసుకుంటే గ్రైండ్​ చేసుకున్న తర్వాత డబ్బాలో పెట్టి ఫ్రిజ్​లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుంటే సరి. నచ్చితే మీరూ ట్రై చేయండి.

కమ్మటి "పండుమిర్చి పచ్చడి" - ఈ కొలతలతో పెడితే ఏడాది నిల్వ!

ఉడకబెట్టకుండా మిక్సీ పట్టి "చారు" చేసుకోండి - నిమిషాల్లో వావ్​ అనిపించే టేస్ట్​తో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.