తెలంగాణ

telangana

ETV Bharat / international

ఏనుగు 6వేల కిలోల బరువు ఎత్తగలదట- ప్రపంచంలో అత్యంత బలమైన జంతువులు ఇవే! - ప్రపంచంలో అత్యంత బలమైన జంతువులు

Strongest Animals In The World : ప్రపంచంలో మనుషుల మధ్య తిరిగే సాధు జంతువులతో పాటు ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. మనుషుల కన్నా బలమైన జంతువులు, పక్షులు కూడా చాలానే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత బలమైన జంతువు ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే స్టోరీ పై ఓ లుక్కేయండి.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 7:15 PM IST

Updated : Feb 11, 2024, 7:27 PM IST

Strongest Animals In The World : ఈ ప్రపంచంలో వేటతో హడలెత్తించే క్రూర మృగాలు ఉన్నాయి. అలానే మనుషులకన్నా బలమైన జంతువులు, పక్షులు చాలానే ఉన్నాయి. కొన్ని జంతువులు వాటి శరీర బరువు కన్నా నాలుగైదు రెట్లు అధికంగా బరువును ఎత్తగలవు, చురుగ్గా కదలగలవు. ఇలా ప్రపంచంలోనే 10 అత్యంత బలమైన జంతువులు ఏంటో ఓ సారి చూద్దాం.

10. హార్పీ ఈగల్
ప్రపంచంలోనే అత్యంత బలమైన పక్షి హార్పీ ఈగల్. అందులోనూ ఆడ ఈగల్ మరింత బలంగా ఉంటుంది. తన శరీరం కంటే రెట్టింపు బరువును ఎత్తగల హర్పీ ఈగల్ చురుగ్గా వేటాడుతుంది. సుమారు 18 కిలోల బరువును అలవోకగా ఎత్తగలదు. ఆహారం కోసం వేటాడేటప్పుడు ఈ సామర్థ్యం ఉపయోగపడుతుంది.

9. చిరుతపులి
చిరుతపులి కూడా అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో ఒకటి. పులి, సింహం వంటి క్రూరమృగాల కన్నా కాస్త బలహీనమైనది. కానీ, ఇతర అడవి మృగాలకన్నా ప్రమాదకరం. సుమారు 30 నుంచి 70 కిలోలు బరువు ఉండే చిరుత పులలు సుమారు 125 కిలోల బరువును ఎత్తగలవు. ఏదైనా జంతువులను వేటాడినప్పుడు ఇతర జంతువుల నుంచి వేటాడిన ఆహారాన్ని కాపాడుకోవడానికి చెట్లపై భద్రపరుచుకునేందుకు ఈ బలం ఉపయోగపడుతుంది.

8. నీటి ఎలుగుబంటి
300 నుంచి 700 కిలోలు వరకు పెరిగే నీటి ఎలుగుబంట్లు చూడటానికే భయంకరంగా ఉంటాయి. వాటి దవడలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. మనుషులకు అస్సలు భయపడని జంతువు నీటి ఎలుగుబంటి. ఇక ఆడ ఎలుగుబంట్లు 150 నుంచి 350 కిలోల బరువు పెరుగుతాయి.

7. సింహం
అడవికి రాజు సింహమే. శక్తికి పర్యాయపదంగా చెప్పే సింహం చాలా బలమైన జంతువు. సుమారు 150 నుంచి 250 కిలోల బరువు పెరిగే సింహలు తన శరీర బరువుకు రెట్టింపు బరువులను ఎత్తగలవు. పూర్తిగా మాంసాహారులైన సింహలను చూస్తే ఇతర జంతువులు భయపడాల్సిందే. ఇక ఆడ సింహలు 120-180 కిలోల బరువు పెరుగుతాయి.

6. గ్రిజ్లీ బేర్
ఉత్తర, దక్షిణ అమెరికాలో కనిపించే గ్రిజ్లీ బేర్ అత్యంత ప్రమాదకరమైన జంతువే కాదు. అత్యంత తెలివైనవిగా చెప్పవచ్చు. ఇతర క్రూరమృగాలు శక్తిపైనే ఆధారపడి వేటాడతాయి. కానీ, గ్రిజ్లీ ఎలుగుబంట్లు సామూహికంగా దాడులు చేస్తాయి. ఐదుగురు మనుషుల బలాన్ని ఒక్క గ్రిజ్లీ బేర్ కలిగివుంటుంది.

5. పులి
సింహం కంటే చురుగ్గా, వేగంగా కదిలే జంతువు పులి. తన శరీర కన్నా రెట్టింపు బరువును ఎత్తగలదు. సుమారు 550 కిలోల బరువును అమాంతం ఎత్తేయగలదు. ఇవి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగు తీస్తాయి.

4. అడవి ఎద్దు
అడవి ఎద్దులు 180 నుంచి 410 కిలోల వరకు బరువు పెరుగుతాయి. బలమైన కండరాలు కలిగి ఉండే ఈ రకం ఎద్దులు క్రూర మృగాల నుంచి తప్పించుకునేందుకు వాటి కొమ్ములతో దాడి చేస్తాయి.

3. ఖడ్గమృగం
ఖడ్గ మృగాలు శాకాహారులు. కానీ, చాలా ప్రమాదకరమైనవి. తెల్ల ఖడ్గమృగాలు 1800 నుంచి 2500 కిలోల బరువు ఉంటాయి. ఆడ ఖడ్గమృగాలు కూడా దాదాపు 2000 కిలోలు బరువు వరకు పెరుగుతాయి. వీటి శక్తిని కొలవడం కష్టమే అయిననప్పటికీ 800 నుంచి 1,100 కిలోల బరువును ఎత్తగల సామర్థ్యం వీటికి ఉంటుంది.

2. గొరిల్లా
చెట్లపై అటు, ఇటు తిరిగే గొరిల్లాలు కూడా శాకాహారులే. కానీ, క్రూరమృగాల నుంచి స్వీయ రక్షణకు అద్భుతంగా పోరాడతాయి. సుమారు 200 కిలోల బరువు పెరిగే గొరిల్లాలు చేతులు బలంగా ఉంటాయి.

1. ఆఫ్రికన్ ఏనుగు
ప్రపంచంలోనే అత్యంత బలమైన జంతువు ఆఫ్రికన్ ఏనుగు. వాస్తవానికి ఏనుగులు ఏ ప్రాంతంలోనైనా బలంగానే ఉంటాయి. వాటిని ఇతర జీవులు వేటాడటం అంత సులువేమీ కాదు. ఈ ఆఫ్రికన్ ఏనుగులకు సుమారు 6000 కిలోల బరువును ఎత్తగల సామర్థ్యం ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర జీవి 'దోమ'- టాప్​ 10 లిస్ట్​లో ఇంకా ఏమున్నాయంటే?

కాల గర్భంలో తరువాత కనుమరుగయ్యేది మనిషేనా?

Last Updated : Feb 11, 2024, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details