Israel Attack On Syria :'సిరియాలోని చారిత్రాత్మక పట్టణం పాల్మీరాపై ఇజ్రాయెల్ బుధవారం భీకర దాడి చేసింది. ఈ దాడిలో 36 మంది మరణించారని, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని' సిరియా స్టేట్ మీడియా తెలిపింది. అయితే ఈ దాడి గురించి వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది.
సిరియాలోని చారిత్రాత్మక పట్టణంపై ఇజ్రాయెల్ దాడి - 36 మంది మృతి - ISRAEL ATTACK ON SYRIA
సిరియాలో చారిత్రాత్మక పట్టణం పాల్మీరాపై ఇజ్రాయెల్ ఎటాక్ - 36 మంది మృతి, 50 మందికి తీవ్రగాయాలు
Published : Nov 20, 2024, 10:31 PM IST
పాల్మీరా పట్టణం సమీపంలో చారిత్రాత్మక రోమన్ ఆలయాల సముదాయం ఉంది. అయితే ఇజ్రాయెల్ చేసిన దాడి వల్ల పాల్మీరాలోని లక్షిత భవనాలు, చుట్టపక్కల ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయని, ఎంత మేరకు ఆస్తి నష్టం సంభవించిందో ఇంకా తెలియరాలేదని స్థానిక వార్తా సంస్థ తెలిపింది.
'ఇజ్రాయెల్ తరచుగా సిరియాలోని ఇరాన్ అనుకూల గ్రూప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడిచేస్తూ ఉంది. ప్రధానంగా ఇరాన్ అనుకూల సైనిక ప్రాంతాలు, ఫెసిలిటీస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంటుంది. అందులో భాగంగా బుధవారం కూడా దాడి చేసింది. దీని వల్ల భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని' స్థానిక మీడియా తెలిపింది.