South Sudan Abyei Attack: సుడాన్, దక్షిణ సుడాన్ మధ్య వివాదాస్పదమైన అబై ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ సాయుధ గుంపు గ్రామస్థులపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 52 మంది మృతి చెందారు. 64 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐక్యరాజ్యసమితి పరిరక్షణ దళానికి చెందిన వారు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగిందని వెల్లడించారు. అయితే ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియనప్పటికీ, ఓ భూవివాదం కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
తరుచూ ఈ ప్రాంతంలో స్థానిక తెగల మధ్య వివాదాలు జరుగుతాయని అబై సమాచార మంత్రి బులిస్ కోచ్ తెలిపారు. అయితే తాజాగా శనివారం దాడి చేసినవారు న్యూర్ తెగకు చెందిన వారు అని పేర్కొన్నారు. ఈ తెగ వారు గతేడాది తమ ప్రాంతంలో వచ్చిన వరదలు కారణంగా వార్రాప్ రాష్టానికి వలస వచ్చారని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనను ఐరాస సంస్థ UNIFSA ఖండించింది. గతంలో అగోక్లోని తమ స్థావరంపై సాయుధ బృందం దాడి చేశాయని పేర్కొంది.
క్రిస్మస్ పార్టీలో కాల్పులు
కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఘటనే మెక్సికోలో జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో జరిగిన క్రిస్మస్ పార్టీలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 'పొసాడా' అనే పార్టీ అనంతరం హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని వెల్లడించారు. అయితే ఆ కాల్పులకు దారితీసిన పరిస్థితులను తెలపలేదు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్ పై క్లిక్చేయండి.