తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​పై ప్రొజెక్టైల్స్​ దాడి- నలుగురు విదేశీ కార్మికులు సహా ఏడుగురు మృతి - PROJECTILE STRIKE ON ISRAEL

ఇజ్రాయెల్​పై ప్రొజెక్టైల్స్ దాడి చేసిన హెజ్​బొల్లా- నలుగురు విదేశీ కార్మికులు సహా ఏడుగురు మృతి

Projectile Strike On Israel
Projectile Strike On Israel (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 5:51 PM IST

Updated : Oct 31, 2024, 9:38 PM IST

Projectile Strike On Israel :ఇజ్రాయెల్​పైకి హెజ్​బొల్లా చేసిన ప్రొజెక్టైల్స్‌ దాడిలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు విదేశీ కార్మికులని స్థానిక అధికారులు తెలిపారు. మెతులా రీజినల్ కౌన్సిల్ ఈ ఘటనను ధ్రువీకరించింది. చనిపోయిన విదేశీ కార్మికులు ఏయే దేశాలకు చెందిన వారు అనే వివరాలు తెలియరాలేదు.

మరో డాడిలో ఇద్దరు మృతి
మెతులా ఘటన జరిగిన గంటల వ్యవధిలో మరో ఇజ్రాయెల్ నగరం హైఫాపై దాడి జరిగింది. లెబనాన్​ నుంచి దాదాపు 25 రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఆలివ్ తోటలో పనిచేసుకుంటున్న వారిపై పడ్డాయని చెప్పింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారని తెలిపింది. మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పింది.

కాగా, గత ఏడాది కాలంగా లెబానాన్​లోని హెజ్​బొల్లా ఇజ్రాయెల్​పైకి రాకెట్స్​, డ్రోన్స్​, క్షిపణులతో దాడి చేస్తోంది. లెబనాన్​పై ఇజ్రాయెల్ దండయాత్ర మొదలైనప్పటి నుంచి హెజ్​బొల్లా చేసిన అతిపెద్ద అటాక్​ ఇదే. గతేడాది యుద్ధం మొదలైనప్పటి నుంచి రాకెట్ల దాడుల వల్ల ఉత్తర ఇజ్రాయెల్​లో దాదాపు 70మంది మృతి చెందారు.

ఉత్తర ఉజ్రాయెల్​ సరిహద్దులో మెతులా టౌన్ ఉంది. మెతులా చుట్టూ మూడు వైపుల లెబనాన్​ భూభాగమే. ఈ యుద్ధం కారణంగా మెతులా టౌన్​లో చాలా విధ్వంసం జరిగింది. 2023 అక్టోబర్​లోనే అక్కడి ప్రజలను ఇజ్రాయెల్​ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పుడు అక్కడ కొందరు వ్యవసాయ కార్మికులు, సైనిక అధికారులు మాత్రమే ఉంటున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాల్లోకి అధికారిక అనుమతితో మాత్రమే ప్రవేశం ఉంటుంది.

రష్యాలోని బిల్డింల్​లో పేలుడు-ఐదుగురు మృతి
దక్షిణ రష్యాలోని ఓ రెసిడెన్సియల్ భవనంలో గ్యాస్ పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కరాచే-చెర్కేసియా ప్రాంతంలోని చెర్కెస్క్ నగరంలో గురువారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా ఐదు అంతస్థుల భవనం- పైన రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే భద్రతా ఉల్లంఘనల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై క్రిమినల్ విచారణ చేపట్టారు అధికారులు. అయితే రష్యాలోని నివాస భవనాల్లో గ్యాస్ పేలుళ్లు సాధారణంగా జరుగుతాయి.

Last Updated : Oct 31, 2024, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details